సదరన్ ట్రావెల్స్ ‘హంగామా’
సాక్షి, సిటీబ్యూరో: జాతీయ, అంతర్జాతీయ పర్యటనలకు ప్రత్యేక ప్యాకేజీలతో ‘ట్రావెల్ హంగామా’పథకాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు సదరన్ ట్రావెల్స్ సంస్థ ఎండీ కృష్ణమోహన్ తెలిపారు. ఈ ట్రావెల్ హంగామాలో భాగంగా అన్ని దేశీయ, అంతర్జాతీయ పర్యటనలపై ప్రత్యేక రాయితీలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం(నేటి) నుంచి ఈ పథకం ప్రారంభం కానుందని, రూ.60 వేల క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా ఉందని, అంతర్జాతీయ పర్యటనలపై ప్రతి టూరిస్టుకు ఒక బహుమతి అందజేయనున్నామని తెలిపారు. ప్యాకేజీ మొత్తాన్ని ఈఎంఐగా చెల్లించే సదుపాయం ఉందని, రూ.5 వేల టోకెన్ అమౌంట్‌తో టూర్‌లను బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. యూరోప్, వియత్నాం, శ్రీలంక, దక్షిణాఫ్రికా, దుబాయ్ తదితర దేశాలకు పర్యటన ప్యాకేజీలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. దేశంలోని అన్ని పర్యాటక, సందర్శక, చారిత్రక ప్రాంతాల కోసం కూడా టూర్ ప్యాకేజీలను రూపొందించినట్లు పేర్కొన్నారు.


