బకాయిలపై వడ్డీలే 7,383 కోట్లు
సాక్షి, సిటీబ్యూరో
జీహెచ్‌ఎంసీ ఈ ఆర్థిక సంవత్సర ఆస్తిపన్ను డిమాండ్ రూ.2,109 కోట్లు. పాత బకాయిలు మాత్రం రూ.4,008 కోట్లు. ఈ బకాయిలపై పెనాల్టీలు మరో రూ.7,409 కోట్లు. అంటే అసలు కంటే వడ్డీలే ఎక్కువ. ఇందుకు కారణం ఏమిటంటే.. సకాలంలో ఆస్తిపన్ను చెల్లించకపోవడం. వడ్డీలపై వడ్డీలు పడటం. దాంతో అసలు కంటే వడ్డీ బకాయిలు భారీగా పేరుకుపోయాయి. అవన్నీ చెల్లింపులు కావు. ఈ పరిస్థితిని నివారించేందుకు గత కొన్నేళ్లుగా పేరుకుపోయిన మొత్తం ఆస్తిపన్నును ఒకేసారి చెల్లిస్తే బకాయిలపై వడ్డీలను కేవలం పది శాతం చెల్లించే సదుపాయాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. అంటే బకాయిల వడ్డీపై 90 శాతం రాయితీ. ఎవరికై నా ఇది ఎంతో గొప్ప ఊరట. తద్వారా తాజా సంవత్సర ఆస్తిపన్ను కూడా ఎక్కువ మంది చెల్లించేందుకు, ఎక్కువ మొత్తం వసూలయ్యేందుకు అవకాశం ఉంటుంది.
● ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని గతంలో మాదిరిగానే ఈ ఆర్థిక సంవత్సరం కూడా ఒన్‌టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ (ఓటీఎస్) కింద బకాయిల వడ్డీలపై 90 శాతం రాయితీకి అవకాశం ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ ప్రభుత్వాన్ని కోరారు.
● ఈమేరకు లేఖ రాశారు. జీహెచ్‌ఎంసీ నిబంధనల మేరకు స్టాండింగ్ కమిటీ ఆమోదం ఉండాలి కనుక నేడు (గురువారం) స్టాండింగ్ కమిటీ ముందుంచనున్నారు. ఈ ఓటీఎస్ సదుపాయం ఉండటం ద్వారా గత మూడేళ్లలో వెరసీ.. జీహెచ్‌ఎంసీకి దాదాపు రూ.956 కోట్ల ఆదాయం లభించింది.
ఈ సంవత్సరం ఆస్తిపన్ను డిమాండ్
ఆస్తులు: 20,09,485
డిమాండ్: రూ. 2,109 కోట్లు
ఇప్పటి వరకు వసూలైంది: రూ.1421 కోట్లు
పాత బకాయిలు చెల్లించాల్సిన వారు: 5,46,304
పేరుకుపోయిన బకాయిలు: రూ.3,930 కోట్లు
బకాయిలపై వడ్డీలు : రూ.7,383 కోట్లు
● బకాయిలపై వడ్డీ మాఫీ వర్తించాలంటే ఈ ఆర్థిక సంవత్సరం వరకు మొత్తం ఆస్తిపన్ను చెల్లించాలి. ఈ ఆర్థిక సంవత్సరం వరకు ఆస్తిపన్ను, వడ్డీలపై పదిశాతం చెల్లింపులు జరుగుతాయి. మొత్తానికి జీహెచ్‌ఎంసీ ఖజానాకు ఆదాయం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
రూ.
ఓటీఎస్‌తో 90 శాతం రాయితీ కావాలి
ప్రభుత్వానికి లేఖ రాసిన కమిషనర్ కర్ణన్
తద్వారా ఈ ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను వసూళ్లు పెరుగుతాయని అంచనా
ఆర్థిక సంవత్సరం ఓటీఎస్‌ను ఓటీఎస్ ద్వారా
వినియోగించుకున్నవారు వసూళ్లు (రూ.కోట్లలో)
2022-23 59838 170.00
2023-24 108091 320.00
2024-25 130800 466.40


