టీజీటీఏ హైదరాబాద్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
సాక్షి సిటీ బ్యూరో : తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ (టీజీటీఏ) హైదరాబాద్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎస్.రాములు, రమేష్ పాక ప్రకటించారు. బుధవారం జరిగిన జనరల్ బాడీ సమావేశంలో నూతన కమిటీ ఎన్నిక జరిగింది. అధ్యక్షులుగా ప్రేమ్‌కుమార్, అసోసియేట్ అధ్యక్షులుగా భిక్షపతి, జి.వెంకట్రామ్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా జ్యోతి, ప్రధాన కార్యదర్శిగా బాలశంకర్, కార్యదర్శిగా సంధ్యారాణి, సంయుక్త కార్యదర్శులుగా పాండు, అసదుల్హా, కృష్ణ కార్తీక, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఎన్.సునీత, హేమలత, మమత, కల్చరల్ సెక్రటరీగా నిహరిక, స్పోర్ట్స్ సెక్రటరీగా అన్వర్, కోశాధికారిగా నయ్యూముద్దీన్, కార్యవర్గ సభ్యులుగా ప్రేమలత, రత్నం, అహల్య, పుష్పలత ఎన్నికయ్యారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ, టీజీటీఏ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షురాళ్లు విజయలక్ష్మి, శ్రీదేవి, అసోసియేట్ అధ్యక్షుడు నరసయ్య తదితరులు పాల్గొన్నారు.


