హామీలన్నీ నెరవేరుస్తాం: మంత్రి పొన్నం
వెంగళరావునగర్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ అత్యధిక మెజార్టీతో విజయం సాధించడం పట్ల యూసుఫ్‌గూడలో పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉన్నామని తెలిపారు. ముఖ్యంగా యూసుఫ్‌గూడ, వెంకటగిరి, హైలాంకాలనీ తదితర ప్రాంతాల్లోని ప్రజల ఆదరణ మరువలేనిదని అన్నారు. ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలైన డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్, మంచినీరు సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించడం జరుగుతుందని హామీనిచ్చారు. ఎమ్మెల్యే నవీవన్ యాదవ్ ఈ ప్రాంతంలో త్వరలోనే పర్యటించి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి సమస్యలు పరిష్కరిస్తారని తెలిపారు. ఈ విజయం నియోజకవర్గ ప్రజలందరిదని, అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు జి.మురళీ గౌడ్, సంజయ్ గౌడ్, పార్టీ సీనియర్ నేతలు ఫిరోజ్‌ఖాన్, లక్ష్మీరెడ్డి, రుబీనా, పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.


