
52 కిలోల గంజాయి పట్టివేత
చిలకలగూడ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఏడో నంబరు ప్లాట్‌ఫారంపై తరలించేందుకు సిద్ధంగా ఉంచిన రూ. 26 లక్షల విలువైన 52 కిలోల గంజాయిని ఆర్పీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్పీఎఫ్ ఎస్‌ఐ రమేష్ నేతృత్వంలో సిబ్బంది సూర్య, నరేష్, రమేష్‌లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏడో నంబరు ప్లాట్‌ఫారంపై 26 బ్యాగులను గుర్తించారు. అక్కడ ఉన్న ప్రయాణికులు, షాప్‌కీపర్స్‌ను వాకబు చేశారు. అనుమానం వచ్చిన పోలీసులు సదరు బ్యాగులను తెరిచి చూడగా గంజాయి కనిపించింది. మొత్తం 26 బ్యాగుల్లో 52 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు గురువారం సికింద్రాబాద్ రైల్వే డీఎస్పీ ఎస్‌ఎన్ జావేద్ తెలిపారు.