ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

May 2 2023 5:06 AM | Updated on May 2 2023 9:44 AM

- - Sakshi

కుషాయిగూడ: ప్రేమ విఫలమై ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ ఉపేందర్‌ యాదవ్‌ తెలిపిన వివరాల ప్రకారం..కుషాయిగూడ నాగార్జునగర్‌కు చెందిన గుంటి మల్లయ్య కుమారుడు మహేష్‌ (31) ఈసీఐఎల్‌లోని టీఎస్‌ఐఐసీ కార్యాలయంలో అకౌంటెంట్‌ ఆడిటర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి చెల్లెలు ఇంటికి వెళ్లి ..అక్కడి నుంచి తన బంధువు గిరీష్‌తో కలిసి తన కార్యాలయానికి వచ్చి అక్కడే నిద్రపోయాడు. ఉదయం కార్యాలయానికి వచ్చిన పనిమనిషి, బంధువు గిరీష్‌ లేచి చూసేసరికి మహేష్‌ ఓ గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని వేలాడుతూ కన్పించాడు. కొంత కాలంగా ఓ యువతిని ప్రేమించాడని, చివరకు ప్రేమ విఫలమై మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మృతుని తల్లి మధునమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement