ఖిలా వరంగల్ : చారిత్రక ఖిలా వరంగల్ కోటను శనివారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరులు అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న ట్రెజరీ సీనియర్, జూనియర్ అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా మధ్యకోటలోని నాలుగు కీర్తి తోరణాల మధ్య శిల్పకళాసంపద ను ఆసక్తిగా తిలకించారు. అనంతరం రాతి, మట్టి కోట, ఖుష్‌మహల్ అందాల ను వీక్షించారు. వీరికి కోట గైడ్ రవి యాదవ్ కాకతీయుల విశిష్టతను వివరించారు. ఏటీఓ శ్రీనివాస్‌రెడ్డి, కోర్సు కోఆర్డినేటర్ వై. రాజేశ్వరి, శ్రీనివాస్, కేంద్రపురావస్తు, రాష్ట్ర పురా వస్తుశాఖ కోఆర్టినేటర్ శ్రీకాంత్, టీఎస్ టీడీసీ కోట ఇన్‌చార్జ్ అజయ్ పాల్గొన్నారు.


