సమస్యలు పరిష్కరించరా? | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించరా?

Sep 29 2026 1:33 AM | Updated on Sep 29 2026 1:33 AM

సమస్యలు పరిష్కరించరా?

వరంగల్‌ అర్బన్‌: గ్రేటర్‌ వరంగల్‌ నగరంలోని కాలనీల్లో సమస్యలు పరిష్కరించరా? అంటూ బల్దియా గ్రీవెన్స్‌లో కమిషనర్‌ టి.వెంకన్న ఎదుట నగరవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో కమిషనర్‌ వెంకన్న దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 92 ఫిర్యాదులు రాగా, అందులో టౌన్‌ ప్లానింగ్‌ సెక్షన్‌కు 36, ఇంజనీరింగ్‌కు 34, ఆరోగ్యం, పారిశుద్ధ్యం 9, రెవెన్యూ విభాగానికి 11, నీటి సరఫరా 2 చొప్పున నమోదయ్యాయి. ప్రతీ అర్జీని బాధ్యతతో పరిశీలించి గడువులోగా పరిష్కరించాలని కమిషనర్‌ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్‌ కమిషనర్‌ జోనా, ఎస్‌ఈ రాజ్‌కుమార్‌, సిటీప్లానర్‌ రవీందర్‌ రాడేకర్‌, డీఎఫ్‌ఓ శంకర్‌లింగం, సీహెచ్‌ఓ లక్ష్మారెడ్డి, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య, సెక్రటరీ అనిల్‌బాబు, పన్నుల అధికారి రామకృష్ణతో పాటు వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఫిర్యాదుల్లో కొన్ని..

● గిర్మాజీపేట లక్ష్మీ అపార్ట్‌మెంట్‌కు డ్రెయినేజీ నిర్మించాలని ఫ్లాట్స్‌ యజమానులు ఫిర్యాదు అందించారు.

● 19వ డివిజన్‌ వివేకానంద కాలనీలో సీసీ రోడ్డు నిర్మించాలని శ్రవణ్‌కుమార్‌ కోరారు.

● వరంగల్‌ ఉర్సులో ‘కుడా’ లేఔట్‌ ప్లాట్‌ ఆక్రమణకు గురైందని ఫిర్యాదు అందింది.

● జానీపీరీల అండర్‌ బ్రిడ్జికి రెండు వైపులా రోడ్లను నిర్మించాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.

● 12వ డివిజన్‌ పెరుకవాడలో 2నెలలుగా తాగునీటి సరఫరా బంద్‌ ఉందని, సరఫరా పునరుద్ధరించాలని కాలనీవాసులు కోరారు.

● 64వ డివిజన్‌ టేకులగుడెంలో మట్టి రోడ్డు అయినా వేయాలని గ్రామస్తులు విన్నవించారు.

● భీమారం, కోమటిపల్లి, గోపాల్‌పూర్‌లో ఏడాది క్రితం టెండర్లు పూర్తయినా పనులు చేపటట్లేదని మాజీ కార్పొరేటర్‌ రజిత ఫిర్యాదు చేశారు.

గ్రేటర్‌ గ్రీవెన్స్‌లో ఫిర్యాదుదారుల ఆవేదన

92 అర్జీలు స్వీకరించిన అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement