ఇది వరంగల్ ప్రతాప్‌నగర్‌లోని కమ్యూనిటీ టాయిలెట్. నిర్వాహకుడికి ఆరు నెలలుగా సొమ్ము చెల్లించకపోవడంతో ఐదు నెలల పాటు కొనసాగించి, వేసిగి వేసారి, చివరికి తాజాగా టాయిలెట్‌కు తాళం వేశారు. ఇలా.. నగరంలోని రూ.లక్షలు పోసి నిర్మించిన కమ్యూనిటీ హాళ్లు పనికి రాకుండా ప్రజలు వినియోగించుకోక దారుణమైన పరిస్థితులు దాపురించాయి. బల్దియా అధికారులు చెబుతున్న మాటలకు.. క్షేత్రస్థాయి నిర్వహణకు ఎక్కడా పొంతన కనిపించడం లేదు.
ఈఫొటోలో కనిపిస్తున్నది వరంగల్ పోచమ్మమైదాన్‌లోని కమ్యూనిటీ టాయిలెట్. ఏడాదిన్నరగా ఉపయోగంలో లేదు. బల్దియా బిల్లు ఇవ్వడం లేదని నిర్వహణ వదిలేశారు. దీంతో టాయిలెట్ అధ్వానంగా మారింది. సమీపంలోని మురికివాడ ప్రజలు మల, మూత్ర విసర్జనకు ఖాళీ స్థలాలకు వెళ్తున్నారు.
నగరంలో అధ్వానంగా కమ్యూనిటీ, పబ్లిక్ టాయిలెట్స్


