● సెంట్రల్ జోన్ డీసీపీ కవిత
కాశిబుగ్గ : ప్రజలకు మెరుగైన, మర్యాదపూర్వకమైన సేవలు అందిస్తూ ఫిర్యాదులపై సత్వర పరిష్కారం చూపాలని సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత తెలిపారు. సోమవారం మట్టెవాడ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పని తీరు, పెండింగ్ కేసులు, శాంతి భద్రతలు, నేర నియంత్రణ చర్యలను సమీక్షించారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ..ప్రజలకు మరింత చేరువగా ఉంటూ, సమర్థవంతమైన సిటిజన్, సెంట్రిక్ పోలీసింగ్ అందించాలన్నారు. కార్యక్రమంలో సీఐ కరుణాకర్‌రావు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
నేరాల అదుపులో భాగస్వాములు కావాలి : ఏసీపీ సదయ్య
నేరాలు, అఘాయిత్యాలు పెరుగుతున్న నేటి పరిస్థితుల్లో నేరాలను అదుపు చేయడానికి అందరూ భాగస్వాములు కావాలని క్రైం ఏసీపీ సదయ్య అన్నారు. సోమవారం వరంగల్ ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అమ్మాయిలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫొటోలు, వివరాలు పంచుకోవడంలో జాగ్రత్త కలిగి, సైబర్ నేరాలపై అవగాహన ఉండాలన్నారు. ఫిర్యాదులు ఏమైనా ఉంటే సీపీ (87126 85257), సీఐ (87126 85142), ఎస్సై(87126 85270) నంబర్లకు వాట్సాప్ చేయాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచి, నేరస్తులకు కౌన్సెలింగ్ ఇచ్చి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చందర్, ఫ్యాకల్టీ, షీ టీమ్ ఎస్సై స్వాతి పాల్గొన్నారు.


