● అదనపు కలెక్టర్ ఎన్.రవి
హన్మకొండ అర్బన్ : అర్హులైన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో ఓటరుగా నమోదు చేసుకోవాలని హనుమకొండ అదనపు కలెక్టర్ ఎన్.రవి అన్నారు. అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పట్టభద్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో నమోదుపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో అదనపు కలెక్టర్ సమావేశం నిర్వహించారు. 2023 నవంబర్ 1 కంటే ముందు పట్టభద్రులైన, ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో స్థానిక నివాసం ఉన్న అర్హులు ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. సమావేశం అనంతరం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో నమోదుకు ఈ.వీ శ్రీనివాస్‌రావు ఫారం–18 ద్వారా తన వివరాలతో పూర్తి చేసిన దరఖాస్తును అదనపు కలెక్టర్ ఎన్. రవి, ఆర్డీఓ వెంకటేశ్‌కు అందించారు. సమావేశంలో ఆర్డీఓలు వెంకటేశ్, డీఎస్. వెంకన్న, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్‌సింగ్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈవీ.శ్రీనివాస్‌రావు, రావు అమరేందర్‌రెడ్డి, నాగబెల్లి రజనీకాంత్, ఎండీ నేహాల్, అంబాల ప్రశాంత్, బస్కె నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


