గ్రాడ్యుయేట్‌ ఓటరుగా | - | Sakshi
Sakshi News home page

గ్రాడ్యుయేట్‌ ఓటరుగా

Sep 29 2026 1:33 AM | Updated on Sep 29 2026 1:33 AM

నమోదు చేసుకోవాలి

హన్మకొండ : ఉమ్మడి నల్లగొండ–వరంగల్‌–ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రారంభమైన ఓటరు నమోదు ప్రక్రియను అర్హత ఉన్న పట్టభద్రులు వినియోగించుకోవాలని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌ రెడ్డి సోమవారం విజ్ఞప్తి చేశారు. పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ నవంబర్‌ 6వ తేదీతో ముగియనుందని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి గ్రాడ్యుయేట్‌ ఈ అవకాశాన్ని వినియోగించుకొని తప్పనిసరిగా ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు. ఇది కేవలం ఓటరు నమోదు ప్రక్రియ మాత్రమే కాదని ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఒక ఆయుధం.. మన సమస్యలను పరిష్కరించుకోవడానికి ఒక అస్త్రం.. డిమాండ్లను సాధించుకోవడానికి ఒక అవకాశం.. మన కోసం పోరాడే వారికి ప్రజాస్వామ్య పద్ధతిలో మద్దతు తెలియజేయడానికి ఒక మార్గం అని రాకేశ్‌ రెడ్డి పేర్కొన్నారు. పట్టభద్రులందరూ ఈ అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకుండా, ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

సీపీని కలిసిన అదనపు కమాండెంట్‌

హసన్‌పర్తి: హైదరాబాద్‌ చీఫ్‌ ఆఫీస్‌ నుంచి మామునూరు టీజీఎస్పీ –4వ బెటాలియన్‌ అదనపు కమాండెంట్‌గా బదిలీపై వచ్చిన వంశీమోహన్‌రెడ్డి సోమవారం వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్వేతను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా భగవద్గీత గ్రంథాన్ని అందజేశారు. అదేవిధంగా ఎంజీఎంలో భద్రతా చర్యలపై సమీక్షలో పాల్గొన్న ఎస్‌పీఎఫ్‌ కమాండెంట్‌ కమాండెంట్‌ కోటేశ్వర్‌రావు మర్యాదపూర్వకంగా సీపీని కలిసి పుష్పగుచ్ఛం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement