పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టిసారించాలి | - | Sakshi
Sakshi News home page

పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టిసారించాలి

Sep 29 2026 1:33 AM | Updated on Sep 29 2026 1:33 AM

పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టిసారించాలి

● జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ వెంకన్న

వరంగల్‌ అర్బన్‌: కాశిబుగ్గ, కాజీపేట సర్కిళ్ల పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ మరింత మెరుగయ్యేందుకు రోజువారీగా డిప్యూటీ కమిషనర్లు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ టి.వెంకన్న ఆదేశించారు. సోమవారం బల్దియా కార్యాలయంలో జరిగిన సమావేశంలో అధికారులకు ఆయన పలు సూచనలిచ్చారు. నగర పరిశుభ్రతలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా, తమ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణకు పూర్తి బాధ్యత వహించాలని ఉప కమిషనర్లను ఆయన ఆదేశించారు.

పండుగలకు ఏర్పాట్లు చేయండి

బతుకమ్మ, దసరా పండుగల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని కమిషనర్‌ వెంకన్న అధికారులను ఆదేశించారు. జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో బతుకమ్మ, దసరా పండుగల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయా సమావేశాల్లో సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ రాజ్‌కుమార్‌, సీఎంహెచ్‌ఓ డాక్టర్‌ రాజారెడ్డి, డీఎఫ్‌ఓ శంకర్‌ లింగం, సిటీప్లానర్‌ రవీందర్‌ రాడేకర్‌, సీహెచ్‌ఓ లక్ష్మారెడ్డి, అదనపు కమిషనర్‌ జోన, ఉప కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య పాల్గొన్నారు.

ఆకట్టుకున్న కళాకృతులు

స్వచ్ఛత హీ సేవా–26 కార్యక్రమంలో భాగంగా గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్‌ హాల్‌లో సోమవారం నిర్వహించిన ‘వేస్ట్‌ టు ఆర్ట్‌’ (వ్యర్థాల నుంచి కళాత్మక వస్తువుల రూపకల్పన) పోటీల్లో విద్యార్థులు రూపొందించిన సజనాత్మక కళాకృతులు ఆకట్టుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement