ఎలుక కాటు ఆనవాళ్లు లేవు | - | Sakshi
Sakshi News home page

ఎలుక కాటు ఆనవాళ్లు లేవు

Sep 29 2026 1:33 AM | Updated on Sep 29 2026 1:33 AM

పాలకుర్తి టౌన్‌ : మండలంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఈనెల 22న విద్యార్థినులను ఎలుకలు కరిచాయన్న ఘటనపై కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా స్పష్టతనిచ్చారు. సోమవారం ఆర్డీఓ కిరణ్‌ప్రకాశ్‌తో కలిసి గురుకులాన్ని తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్‌ విద్యార్థినులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. భోజనం ఎలా ఉంది? మీకు ఎలుకలు కరిచినప్పుడు వాటిని చూశారా? టీకాలు తీసుకున్నారా? అని ప్రశ్నించారు. ఏ సమయంలో జరిగింది.. అప్పుడు రక్తం వచ్చినట్లు అనిపించిందా.. నొప్పిగా ఏమైనా ఉందా అని వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థినుల చేతులు, కాళ్లను పరిశీలించగా ఎలుకలు కరిచిన ఆనవాళ్లు, గీతలు లేవన్నారు. వదంతులు నమ్మొద్దని కలెక్టర్‌ సూచించారు. వంటశాల, భోజన గది, సరుకులు నిల్వ గది, మరుగుదొడ్లు, వసతి గృహాలను పరిశీలించారు. పరిసరాల శుభ్రతపై అసంతప్తి వ్యక్తం చేసి, పనికిరాని వ్యర్థాలను వెంటనే తొలగించాలని పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌ రెడ్డిని ఆదేశించారు. నాణ్యమైన పౌషికాహారం, తాజా కూరగాయలతో భోజనం తయారు చేయాలని సూచించారు. అనుమతి లేకుండా బయటి వ్యక్తులను బాలికల గురుకులంలోకి అనుమతించొద్దని స్పష్టం చేశారు. కలెక్టర్‌ తనిఖీ చేసే సమయంలో గురుకుల పాఠశాలలోకి వచ్చిన వార్డు సభ్యుడిపై పోక్సో కేసు నమోదు చేయాలని కలెక్టర్‌ ఆదేశించినట్లు సమాచారం. ఎంపీడీఓ, తహసీల్దార్‌ గురుకుల పాఠశాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సూచించారు. తహసీల్దార్‌ సరస్వతి, ఎంపీడీఓ వేదవతి, ఎంఈఓ పోతుగంటి నర్సయ్య, వైస్‌ ప్రిన్సిపాల్‌ వరలక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా

గురుకులంలో తనిఖీ..శుభ్రతపై

అసంతృప్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement