సీఈసీ పదవి నుంచి తొలగించాలి | - | Sakshi
Sakshi News home page

సీఈసీ పదవి నుంచి తొలగించాలి

Sep 27 2026 4:04 AM | Updated on Sep 27 2026 4:04 AM

సీఈసీ పదవి నుంచి తొలగించాలి

హన్మకొండ: ముఖ్య ఎన్నికల అధికారి జ్ఞానేశ్‌కుమార్‌ను తక్షణమే సీఈసీ పదవి నుంచి తొలగించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. శనివారం హనుమకొండ బాలసముద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయం నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు సీపీఐ హనుమకొండ జిల్లా సమితి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించి అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ధర్నా చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఓటర్ల హక్కులు కాపాడాలని డిమాండ్‌ చేస్తూ వందలాది మంది నాయకులు, కార్యకర్తలు ఈ ర్యాలీ, ధర్నాలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈసందర్భంగా తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ అక్రమంగా తొలగించిన ఓటర్లందరి పేర్లను వెంటనే పునరుద్ధరించాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్నారు. సీఈసీ జ్ఞానేశ్వర్‌ను తొలగించే వరకు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వరకు సీపీఐ ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, నాయకులు సిరబోయిన కరుణాకర్‌, ఆదరి శ్రీనివాస్‌, తోట భిక్షపతి, మద్దెల ఎల్లేష్‌, ఎన్‌.అశోక్‌ స్టాలిన్‌, ఏదునూరి వెంకట్రాజం, కర్రె లక్ష్మణ్‌, జక్కు రాజు గౌడ్‌, నకీర్త ఓదెలు, వేల్పుల సారంగపాణి, కామెర వెంకటరమణ, గుంటి రాజేందర్‌, మాలోతు శంకర్‌ నాయక్‌, రాసమల్ల దీనా, కొట్టె వెంకటేశ్‌ పాల్గొన్నారు.

సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి

తక్కళ్లపల్లి శ్రీనివాసరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement