హన్మకొండ: వేసవిలో డిమాండ్‌కు అనుగుణంగా నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు అన్ని సర్కిళ్లలో ముందస్తు చర్యలు చేపట్టాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్ణాటి వరుణ్‌రెడ్డి ఆదేశించారు. శనివారం హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ ప్రధా న కార్యాలయం నుంచి 18 సర్కిళ్ల ఎస్‌ఈలు, డీఈ లు, ఏడీఈలు, ఎస్‌ఏఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని రూపొందించాల్సిన కార్యాచరణపై సమీక్షించారు. సీఎండీ మాట్లాడుతూ 33 కేవీ, 11 కేవీ ఓవర్‌లోడ్ ఫీడర్లను ముందుగానే గుర్తించి అవసరమైన చోట కండక్టర్ అప్‌గ్రేడేషన్ చేపట్టాలని, కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణం, అదనపు డీటీఆర్‌ల ఏర్పాటు, ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్య పెంపు పనుల్లో వేగం పెంచాలన్నారు. డీటీఆర్‌లపై లోడ్‌ను నిరంతరం పర్యవేక్షించాలని, 60 శాతానికి పైగా లోడ్ ఉన్న డీటీఆర్‌లను ముందుగానే గుర్తించి అవసరమైన చోట సామర్థ్యాన్ని పెంచాలన్నారు. టాంగ్ టెస్టర్ రీడింగ్‌లను తీసుకుని లోడ్ బ్యాలెన్సింగ్ చర్యలు చేపట్టాలని సూచించారు. డైరెక్టర్లు వి.మోహన్‌రావు, వి.తిరుపతిరెడ్డి, సి.ప్రభాకర్, సీఈలు పాల్గొన్నారు.
టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి


