● వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
మామునూరు : నిర్ణీత ప్రణాళిక ప్రకారం విమానాశ్రయం నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. ఈ మేరకు శనివారం వరంగల్ మామునూరు విమానాశ్రయాన్ని అదనపు కలెక్టర్ ఎల్. కిశోర్‌కుమార్, ఆర్డీఓ సుమ, ఎయిర్‌పోర్ట్ అథారిటీ అధికారి నటరాజ్, ఈఈ రాజేందర్, ఇతరశాఖల అధికారులతో కలిసి సందర్శిచారు. పాత రన్‌వే, పరిసరాలు, భూసేకరణ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి సంబంధించి చేపట్టాల్సిన పనులు, ఆయా శాఖల పరిధిలోని అంశాలపై ఆయా ఆధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ నిర్ణీత ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తహసీల్దార్ ఇక్బాల్, ఆర్‌అండ్‌బీ ఈఈ రా జేందర్, ఇరిగేషన్ డీఈ సురేశ్‌బాబు, డీఈ మధుసూదన్, నేషనల్ హైవే డీఈ అమీర్‌పాషా పాల్గొన్నారు.


