వరంగల్ స్పోర్ట్స్: ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి పాఠశాల క్రీ డల సమాఖ్య అండర్– 14, 17 బాలబాలికల ఎంపిక పోటీలు శనివారం ఉత్సాహంగా కొనసాగాయి. వరంగల్ జిల్లా ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో వరంగల్ కాశీబుగ్గలోని ఓసిటీ మైదానంలో ఉషు, టంగ్‌తా క్రీడల ఎంపికలు నిర్వహించా రు. అలాగే , హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో వెయిట్ లిఫ్టింగ్, లాన్‌టెన్నీస్ క్రీడాంశాల్లో ఎంపికలు నిర్వహించినట్లు ఎస్‌జీఎఫ్ వరంగల్ జిల్లా కార్యదర్శి పుల్ల అ నిల్ తెలిపారు. నాలుగు క్రీడాంశాల్లో జరిగిన ఈ పోటీలకు ఉ మ్మడి జిల్లా నుంచి 400 మంది క్రీడాకారులు ఎంపికై నట్లు చె ప్పారు. పీఈటీల సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఎం. వెంకటేశ్వర్లు, కన్వీనర్లు పి. సుధాకర్, జె. సతీశ్, బి. రవీనా, సుజాత, జి. ధన్‌రాజ్, పీఈటీలు నాగరాజు, సతీశ్, పాషా, సమ్మయ్య, పెద్దిరాజ్, రఘువీర్, తదితరులు పాల్గొన్నారు.


