సహారా సొమ్ము.. ఇంకెన్నాళ్లు? | - | Sakshi
Sakshi News home page

సహారా సొమ్ము.. ఇంకెన్నాళ్లు?

Sep 27 2026 4:04 AM | Updated on Sep 27 2026 4:04 AM

హన్మకొండ: సహారా సంస్థల్లో డిపాజిట్‌ చేసిన తమ సొమ్మును వెంటనే తిరిగి చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ బాధితులు శనివారం హనుమకొండలోని అంబేడ్కర్‌ విగ్రహం కూడలిలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏళ్లుగా తమ డబ్బు కోసం ఎదురుచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. డిపాజిట్‌ సొమ్ము తిరిగి అందక పిల్లల చదువులు, పెళ్లిళ్లు, వైద్య ఖర్చులు, ఇళ్ల నిర్మాణం వంటి అవసరాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. సహారా సంస్థలకు చెందిన ఆస్తులను విక్రయించి, వచ్చిన మొత్తంతో డిపాజిటర్లకు వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం, సుప్రీంకోర్టు వెంటనే స్పందించి సహారా డిపాజిటర్ల సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర సహారా ఖాతాదారుల, కార్యకర్తల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.బాలయ్య, ఉపాధ్యక్షులు రవీందర్‌రెడ్డి, గడల కుమార్‌, గుండేటి కుమార్‌, ప్రధాన కార్యదర్శి ఎం.నరేశ్‌, కోశాధికారి డక్క సుధాకర్‌, కార్యదర్శి రాము, అమీనా, నర్సయ్య, సఫియా, విజయ, చందు, సదానందు, మద్దెల రమేశ్‌, కాసారపు తిరుపతి, శ్రీనివాస్‌, రాజమౌళి, శంకరయ్య, ప్రభాకర్‌, వేణుగౌడ్‌, నరేందర్‌, బాలరాజ్‌, నరేంద్రబాబు, కె. వేణు, బి. శివ, రాంబాబు, ఎ. సతీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

డిపాజిటర్లకు వెంటనే చెల్లించాలి

అంబేడ్కర్‌ విగ్రహం కూడలిలో బాధితుల ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement