● చైర్మన్‌గా మూడోసారి విజయచందర్‌రెడ్డి
హన్మకొండ అర్బన్: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హనుమకొండ జిల్లా పాలకమండలి ఏకగ్రీవంగా ఎన్నికై ంది. శనివారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తికావడంతో 19 మంది అభ్యర్థుల్లో నలుగురు నామినేషన్లు ఉపసంహరించుకోగా, మిగిలిన 15 మంది మేనేజింగ్ కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం డాక్టర్ పెసరు విజయచందర్‌రెడ్డి చైర్మన్‌గా మూడోసారి ఎన్నికయ్యారు. రెడ్ క్రాస్ భవన్‌లో నిర్వహించిన ఈకార్యక్రమంలో ఎన్నికల పరిశీలకుడు, అదనపు కలెక్టర్ బి.శేషాద్రి, ఎన్నికల అధికారి బి.నవీన్‌కుమార్ నూతన కమిటీని ప్రకటించి ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. వైస్ చైర్మన్‌గా పెద్ది వెంకట్ నారాయణ్‌రెడ్డి, రాష్ట్ర పాలక మండలి సభ్యుడిగా ఈవీ.శ్రీనివాస్‌రావు, కోశాధికారిగా బొమ్మినేని పాపిరెడ్డి ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులుగా గొట్టిముక్కల శ్రీలక్ష్మీ, ఈవీ.శ్రీనివాస్‌రావు, పెద్ది వెంకట్ నారాయణగౌడ్, డాక్టర్ యస్.జ్యోతి, డాక్టర్ నల్ల సురేందర్‌రెడ్డి, హరిప్రసాద్, పాపిరెడ్డి, రాకేశ్, డాక్టర్ పెసరు విజయచందర్‌రెడ్డి, డాక్టర్ కె.సుధాకర్‌రెడ్డి, మాటేటి నీరజ, బిళ్ల రమణారెడ్డి, డాక్టర్ సీహెచ్.సంధ్యారాణి, పుల్లూరి వేణుగోపాల్, పొన్నాల సంయుక్త ఎన్నికయ్యారు. అనంతరం కమిటీ ప్రతినిధులు కలెక్టర్‌ను మర్యాద పూర్వకరంగా కలిశారు.
వరంగల్‌లో..
న్యూశాయంపేట: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా పాలకవర్గం ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి, జెడ్పీ సీఈఓ వసంత తెలిపారు. మొత్తం 25 మంది నామినేషన్లు వేయగా శనివారం జెడ్పీ హాల్‌లో స్క్రూట్నీ నిర్వహించారు. అర్హత పొందిన 25 మంది సభ్యుల్లో పది మంది నామినేషన్లు విత్‌డ్రా చేసుకున్నట్లు తెలిపారు. దీంతో సొసైటీ సభ్యుల ఎన్నికల ప్రక్రియ నిబంధనల మేరకు 15 మంది సభ్యులు పోటీలో ఉన్నారన్నారు. ఈ నెల 28న చైర్మన్, వైస్ చైర్మన్, సెక్రటరీ, ట్రెజరర్, మేనేజింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక జరుగుతుందని ఎన్నికల అధికారి తెలిపారు.


