ట్రాన్స్‌కో కన్‌స్ట్రక్షన్‌ డీఈ సంపతిరావు సస్పెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌కో కన్‌స్ట్రక్షన్‌ డీఈ సంపతిరావు సస్పెన్షన్‌

Sep 25 2026 2:35 AM | Updated on Sep 25 2026 2:35 AM

హన్మకొండ: టీజీ ట్రాన్స్‌ కో వరంగల్‌ జోన్‌ కన్‌స్ట్రక్షన్‌ డీఈ ఎల్‌.సంపతిరావుపై యాజమాన్యం సస్పెన్షన్‌ వేటు వేసింది. వరంగల్‌ జోన్‌ కార్యాలయంలో చీఫ్‌ ఇంజనీర్‌పై దౌర్జన్యం, దాడి, బెదిరించిన ఘటనలో ఎల్‌.సంపతి రావును సస్పెండ్‌ చేస్తూ టీజీ ట్రాన్స్‌ కో ఫైనాన్స్‌ కమర్షియల్‌, హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్‌ శ్రీనివాస్‌లు ఓరుగంటి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ట్రాన్స్‌ కో వరంగల్‌ కార్యాలయంలో ఇన్‌చార్జ్‌ బాధ్యతలపై ఈ నెల 18వ తేదీన ఎల్‌.సంపతిరావు బయటి వ్యక్తులను తీసుకొచ్చి దాడి, దౌర్జన్యం చేయడం, బెదిరించడంపై విజిలెన్స్‌ అధికారులు విచారణ జరిపి నివేదిక సమర్పించారు. దీంతో క్రమశిక్షణ చర్య ల కింద సంపతిరావును సస్పెండ్‌ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సస్పెన్షన్‌ ఉత్తర్వులు అమలులో ఉన్నంత కాలం అనుమతి లేకుండా హెడ్‌ క్వార్టర్‌ విడిచి వెళ్లొద్దని ఆదేశించారు.

26న సహాయ ఉపకరణాల గుర్తింపు శిబిరం

హన్మకొండ అర్బన్‌ : కాళోజీ సెంటర్‌: జిల్లాలో 1 నుంచి 18 ఏళ్ల వయస్సు గల దివ్యాంగ, ప్రత్యేక అవసరాల విద్యార్థులకు సహాయ ఉపకరణాల గుర్తింపు, నిర్ధారణ శిబిరాన్ని ఈ నెల 26న నిర్వహించనున్నట్లు వరంగల్‌ జిల్లా విద్యాశాఖ అధికారి బి.రంగయ్యనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్‌ శంభునిపేట జీహెచ్‌ఎస్‌ ప్రాంగణంలో నిర్వహించే శిబిరంలో ఏఎల్‌ఐఎంసీఓ బృందం పరీక్షలు నిర్వహించి, అర్హులైన విద్యార్థులకు సమగ్రశిక్ష ద్వారా అవసరమైన ఉపకరణాలు అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఆధార్‌, సదరం, యూడీఐడీ కార్డు, రేషన్‌కార్డు/ఆదాయ ధ్రువీకరణ పత్రం, రెండు పాస్‌పోర్ట్‌ ఫొటోలు, బ్యాంక్‌ పాస్‌బుక్‌ జిరాక్స్‌ తీసుకురావాలని సూచించారు. జిల్లాలోని అన్ని మండలాల పరిధిలో ఉన్న అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు సమ్మిళిత విద్యా జిల్లా సమన్వయకులు డాక్టర్‌ కె.శ్రీనివాస్‌ (98488 78455)ను సంప్రదించవచ్చని డీఈఓ సూచించారు.

ఐఐటీ ఖరగ్‌పూర్‌

కాన్ఫరెన్స్‌కు కేయూ ప్రొఫెసర్‌

కేయూ క్యాంపస్‌: ఐఐటీ ఖరగ్‌ఫూర్‌లోని కెమికల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో ఈనెల 25, 26 తేదీల్లో జరగబోయే ఇంటర్‌ఫోర్‌ ఇండియా–26 కాన్ఫరెన్స్‌కు కాకతీయ యూనివర్సిటీ గణిత విభాగం ప్రొఫెసర్‌ ఆచార్య పి.మల్లారెడ్డికి ఆహ్వానం అందింది. జనరలైజ్డ్‌ ప్లాన్‌ స్టెయ్రిన్‌ ప్రాబ్లెమ్స్‌ ఇన్‌ పోరలాస్టిక్‌ మెటిరీయల్స్‌ అంశంపై ప్రజెంటేషన్‌ ఇవ్వబోతున్నారు. ఈకాన్పెరెన్స్‌లో ఇన్విటైడ్‌ స్పీకర్‌గా మల్లారెడ్డి పాల్గొననున్నారు.

కుటుంబ కలహాలతో

యువకుడి ఆత్మహత్య

● హైదరాబాద్‌లో ఘటన..

మృతుడు మల్కాపూర్‌ వాసి

చిల్పూరు: కుటుంబ కలహాలతో జనగామ జిల్లా చిల్పూరు మండలం మల్కాపూర్‌ గ్రామానికి చెందిన పుల్యాల మణికంఠరెడ్డి ((37) హైదరాబాద్‌లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన రాంరెడ్డి, పుష్ప దంపతుల కుమారుడు మణికంఠ తండ్రి మృతి చెందిన అనంతరం హైదరాబాద్‌లోని ఇస్నాపూర్‌లో ఉంటున్నాడు. కొద్ది రోజులుగా భార్యతో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం రాత్రి కూడా జరగగా క్షణికావేశంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు కేసు నమోదు చేశా రు. మణికంఠరెడ్డి అంత్యక్రియలు గురువారం స్వగ్రామం మల్కాపూర్‌లో నిర్వహించారు.

మృతురాలి వివరాలు గుర్తింపు

స్టేషన్‌ఘన్‌పూర్‌ : కాజీపేట నుంచి సికింద్రాబాద్‌ వైపున వెళ్తున్న వందేభారత్‌ రైలు కింద పడి ఘన్‌పూర్‌–నష్కల్‌ రైల్వేస్టేషన్ల మధ్య ఆత్మహత్యకు పాల్పడిన యువతిని జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం రంగరాయగూడెం గ్రామానికి చెందిన గుండె మానస (20)గా గుర్తించారు. కాజీపేట జీఆర్‌ పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గుండె రాంచంద్రు, మంజుల దంపతుల కుమార్తె మానస ఇంట్లో జరిగిన గొడవలతో మనస్తాపానికి గురై ఈ నెల 20వ తేదీన ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు జీఆర్‌ పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement