హన్మకొండ: ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ (థామస్ రెడ్డి వర్గం) కూటమిని గెలిపించాలని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న పిలుపునిచ్చారు. గురువారం వరంగల్ భద్రకాళి ఆలయంలో ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న, వరంగల్ రీజియన్ కార్యదర్శి శ్రీనివాస్, ఎన్‌ఎంయూ వరంగల్ రీజియన్ కార్యదర్శి సి.హెచ్.యాకస్వామి, నాయకులు పూజలు నిర్వహించి గుర్తింపు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అనంతరం హనుమకొండలోని వరంగల్–1 బస్ డిపోకు చేరుకుని ప్రచారం చేశారు. ఇక్కడి నుంచి వరంగల్–2 డిపో, వరంగల్ రీజినల్ మేనేజర్ కార్యాల యం, ములుగు రోడ్‌లోని ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీకి చేరుకుని కార్మికులు, ఉద్యోగులను కలిసి కూటమిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారానికి, హక్కుల సాధనకు ఎంప్లాయీస్ యూనియన్ పాటుపడుతుందన్నారు. క్లాస్–3కి ఎంప్లాయీస్ యూనియన్‌కు, క్లాస్–6కు ఎన్‌ఎంయుకూ ఓటు వేయాలని కోరారు. రీజియన్ చైర్మన్ సంకటాల రవికుమార్, ప్రెసిడెట్ మురళి, నాయకులు వి.కె .స్వామి, ఎం.రాజు, బి.రాజు, మహేందర్, విరాట్, తదితరులు పాల్గొన్నారు.
యూనియన్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న


