సింగపూర్‌ స్ఫూర్తితో విద్యలో మార్పులు | - | Sakshi
Sakshi News home page

సింగపూర్‌ స్ఫూర్తితో విద్యలో మార్పులు

Sep 25 2026 2:35 AM | Updated on Sep 25 2026 2:35 AM

కాళోజీ సెంటర్‌: సింగపూర్‌ విద్యావ్యవస్థ, బోధనా పద్ధతులు, పాఠశాలల నిర్వహణను అనుసరించడం ద్వారా రాష్ట్రంలోని పాఠశాల విద్యలో మార్పులు తీసుకురావొచ్చని ఖిలా వరంగల్‌ మండలం బొల్లికుంట జెడ్పీహెచ్‌ఎస్‌ జీవశాస్త్ర ఉపాధ్యాయుడు చల్లా కృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ నెల 12 నుంచి 19 వరకు సింగపూర్‌లో నిర్వహించిన తెలంగాణ ఉపాధ్యాయుల బృందం అధ్యయన పర్యటనలో ఆయన పాల్గొన్నారు. అక్కడి ఉపాధ్యాయ శిక్షణ, సాంకేతిక ఆధారిత బోధన, విద్యార్థి కేంద్రిత అభ్యసన విధానాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి విశేషాలను స్థానిక విలేకరులతో పంచుకున్నారు. సింగపూర్‌లో ఏకరూప పాఠ్యప్రణాళిక, కేంద్రీకృత విద్యా నిర్వహణ, ద్విభాషా బోధనకు ప్రాధాన్యం ఉందని తెలిపారు. ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లతో డిజిటల్‌ అభ్యసనం, స్వయం అభ్యసనం, శారీరక విద్య, కళలు, పరిశుభ్రతతో పాటు క్రిటికల్‌ థింకింగ్‌, కమ్యూనికేషన్‌, టీంవర్క్‌, డిజిటల్‌ లిటరసీ వంటి 21వ శతాబ్దపు నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంపొందిస్తున్నారని వివరించారు. సింగపూర్‌ ఉత్తమ బోధనా పద్ధతులను రాష్ట్రంలో అమలు చేస్తే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల సమగ్ర వికాసానికి దోహదపడుతుందని చల్లా కృష్ణారెడ్డి పేర్కొన్నారు.

జీవశాస్త్ర ఉపాధ్యాయుడు చల్లా కృష్ణారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement