ఏఎస్‌ఓ విధుల నుంచి రాజేశ్వర్‌ రిలీవ్‌ | - | Sakshi
Sakshi News home page

ఏఎస్‌ఓ విధుల నుంచి రాజేశ్వర్‌ రిలీవ్‌

Sep 11 2026 12:02 PM | Updated on Sep 11 2026 12:02 PM

ఏఎస్‌ఓ విధుల నుంచి రాజేశ్వర్‌ రిలీవ్‌ స్పార్క్‌ ఫేస్‌ ఆఫ్‌ ఇండియా–26కు నిట్‌ డైరెక్టర్‌ ఎంపిక పెండింగ్‌ దరఖాస్తులపై ఆరా! చలో హైదరాబాద్‌ వాయిదాపై అసంతృప్తి

విద్యారణ్యపురి: హనుమకొండ డీఈఓ కార్యాలయంలో ఐదేళ్లకుపైగా రీ డిప్లాయిమెంట్‌ ప్రాతిపదికన అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌గా (ఏఎస్‌ఓ) విధులు నిర్వర్తిస్తున్న మ్యాథ్స్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ పీవీ.రాజేశ్వర్‌ను ఈనెల 8న ఏఎస్‌ఓ విధుల నుంచి రిలీవ్‌ చేసినట్లు డీఈఓ ఎల్వీ గిరిరాజ్‌గౌడ్‌ గురువారం తెలిపారు. ఐదేళ్లకుపైగా.. ఏఎస్‌ఓగా సర్వీస్‌ పూర్తి కావడంతో రాజేశ్వర్‌కు గతంలోనే కేటాయించిన జనగామ జిల్లా డీఈఓ కార్యాలయంలో తక్షణమే రిపోర్ట్‌ చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈమేరకు రాజేశ్వర్‌ జనగామ డీఈఓ కార్యాలయంలో రిపోర్ట్‌ చేసినట్లు సమాచారం.

కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్న వారికే..

డీఈఓ కార్యాలయంలో కీలక అసిస్టెంట్‌ స్టాటిస్టిక్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించేందుకు మ్యాథ్స్‌ స్కూల్‌ అసిస్టెంట్‌గా ఉండి కంప్యూటర్‌కు సంబంధించిన పూర్తి పరిజ్ఞానం కలిగిన వారినే డిప్యుటేషన్‌పై తీసుకుంటామని డీఈఓ ఎల్వీ గిరిరాజ్‌గౌడ్‌ గురువారం తెలిపారు. అర్హులు హనుమకొండ కలెక్టర్‌ అనుమతితో డిప్యూటేషన్‌పై తీసుకుంటామని తెలిపారు.

కాజీపేట అర్బన్‌: నిట్‌ వరంగల్‌ డైరెక్టర్‌ బిద్యాధర్‌ సుబుదీని ఇండియా స్పార్క్‌ సంస్థ ఇండియా స్పార్క్‌ ఫేస్‌ ఆఫ్‌ ఇండియా–26కు ఎంపిక చేసి గురువారం సత్కరించింది. 2023వ సంవత్సరం నుంచి నిట్‌ వరంగల్‌ డైరెక్టర్‌గా, 30 ఏళ్ల నుంచి విద్యా పరిశోధన రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరుస్తున్న నిట్‌ డైరెక్టర్‌ను ఇండియా స్పార్క్‌ ఫేస్‌ ఆఫ్‌ ఇండియా–26కు ఎంపిక చేసినట్లు ఆ సంస్థ సీఈఓ రూపా తంతి తెలిపారు.

వరంగల్‌ అర్బన్‌: ‘పుర సేవ పక్కదోవ’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాన్ని బల్దియా కమిషనర్‌ వెంకన్న సీరియస్‌గా తీసుకున్నారు. సిటిజన్‌ చార్టర్‌ ప్రకారం గడువులోగా పరిష్కారానికి నోచుకోని ఫైళ్లపై వివరణ ఇవ్వాలని డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీరింగ్‌ ఎస్‌ఈ, టౌన్‌ స్లానింగ్‌ సీపీని ఆదేశించారు. పౌర సేవలపై నిర్లక్ష్యం వహిస్తే శా ఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయా విభాగాల అధికారులు సిబ్బందికి క్లియరెన్స్‌ ఇవ్వాలని ఆదేశించారు.

హన్మకొండ: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించాల్సిన ‘చలో హైదరాబాద్‌’ కార్యక్రమాన్ని వాయిదా వేయడంపై ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కుందూరు గోపాల్‌రెడ్డి అన్నారు. హనుమకొండ రాంనగర్‌లోని అసోసియేషన్‌ జిల్లా కార్యాలయంలో గురువారం అత్యవసర సమావేశం నిర్వహించారు. జేఏసీ నాయకత్వం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కుదుర్చుకున్న ఒప్పందంపై సమగ్రంగా చర్చించేందుకు ఈ నెల 15న ఉదయం 11 గంటలకు రాంనగర్‌లోని జిల్లా కార్యాలయ ఆవరణలో జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పిండి కుమారస్వామి, కోశాధికారి పుల్లూరు విద్యాసాగర్‌, ఉపాధ్యక్షుడు నారాయణరావు, కార్యవర్గ సభ్యులు ఎన్‌.సమ్మయ్య, ఎం.వెంకట్‌రెడ్డి, కె.జగదీశ్వర్‌రెడ్డి, శ్రీరాములు, ఎ.సారయ్య, పెద్ది ఆంజనేయులు, తాటికొండ సుధాకర్‌, గట్టు ఉప్పలయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement