వరంగల్‌ డీఎంఓగా నాగరాజు బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌ డీఎంఓగా నాగరాజు బాధ్యతల స్వీకరణ

Aug 19 2026 12:42 AM | Updated on Aug 19 2026 12:42 AM

ఖిలా వరంగల్‌: వరంగల్‌ జిల్లా మార్కెటింగ్‌ అధికా రిగా నాగరాజు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. డీఎంఓ కలకోట్ల సురేఖ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమెస్థానంలో మెదక్‌ జిల్లా డీఎంఓ నాగరాజును ఇక్కడికి బదిలీ చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం బాధ్యతలు చేపట్టి కలెక్టర్‌ సత్యశారదను మార్కెట్‌ కార్యదర్శి శ్రీనివాస్‌తో కలిసి మర్యాద పూర్వకంగా కలిశారు.

పాము కాటుతో

మహిళా కూలీ మృతి

మరిపెడ రూరల్‌: పాము కాటుతో ఓ మహిళా కూలీ మృతి చెందింది. ఈ ఘటన మహబూబాబాద్‌ జి ల్లా మరిపెడ మండలం బాల్నిధర్మారంలో చోటు చే సుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మక్కల రాములమ్మ (55) సోమవారం గ్రా మంలోని ఓ రైతుకు చెందిన పత్తి చేనులో కలుపు తీస్తుండగా పాము కాటు వేసింది. సహకూలీలు గ మనించి వెంటనే మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement