● వరంగల్ డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్
కాళోజీ సెంటర్: ప్రస్తుత సాంకేతిక విప్లవానికి అనుగుణంగా ఇంటర్మీడియట్ సిలబస్‌ను మార్చినట్లు వరంగల్ డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ అన్నారు. హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మంగళవారం అధ్యాపకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ సుమన్ మాట్లాడుతూ జనరల్ విభాగంలో చదివే విద్యార్థుల కోసం తెలుగు ద్వితీయ భాషా పాఠ్యపుస్తకాన్ని పూర్తిగా నూతన శైలిలో రూపొందించారని, సమకాలీన అంశాలు, నైతిక విలువలు, సృజనాత్మకత పెంపొందించేలా నూతన పాఠ్యాంశాలను చేర్చారన్నారు. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా కృత్రిమ మేథ(ఏఐ) డిజిటల్ తరగతుల ద్వారా బోధించే ప్రణాళిక ఉందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు శ్రీనివాస్‌రావు, మాధవరావు, పరశురాం, శ్రీదేవి, అధ్యాపకులు, రిసోర్స్‌పర్సన్స్ పాల్గొన్నారు.


