కేయూ క్యాంపస్: మౌలిక వసతుల కల్పనకు కేయూకు రూ.500 కోట్లు కేటాయించాలని కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ (కుర్తా) అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎ.సదానందం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేయూ గెస్ట్‌హౌస్‌లో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాడు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఉన్నత విద్య అవకాశాలు పరిమితంగా ఉన్నరోజుల్లో కాకతీయ యూనివర్సిటీ ఏర్పాటుతో బడుగు, బలహీనవర్గాల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోనికి వచ్చిందని గుర్తుచేశారు. తొలి ఉపకులపతి వెంకట్రామయ్య అంకితభావం, కఠోరశ్రమ, ముందుచూపుతో కాకతీయ యూనివర్సిటీకి బలమైన పునాదులు వేశారన్నారు. తర్వాత వీసీలుగా బాధ్యతలు నిర్వర్తించిన జాఫర్‌నిజాం, వాసుదేవ్ తదితరులు అదేస్ఫూర్తిని కొనసాగించారని వివరించారు. దివంగత వీసీ ఎన్.లింగమూర్తి హయాంలో అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేశారని, అధ్యాపకుల నియామకాలు కూడా చేపట్టినట్లు వివరించారు.
గోల్డెన్‌జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ఈనెల 11న ఉదయం10 గంటలకు కుర్తా ఆధ్వర్యంలో పరిపాలన భవనంలోని సెనేట్‌హాల్‌లో విశ్రాంత ఆచార్యుల సమావేశం (మీట్) ను నిర్వహిస్తామని చెప్పారు. యూనివర్సిటీలో 204 మంది విశ్రాంత అధ్యాపకులు ఉన్నారని, 70 ఏళ్లపైబడిన విశ్రాంత అధ్యాపకులను కేయూ గోల్డెన్‌జూబ్లీ ఉత్సవాల మీట్‌లో సన్మానించనున్నట్లు వివరించారు. ఉత్సవాలకు కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించామని తెలిపారు. సమావేశంలో కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ప్రొఫెసర్ వడ్డె రవీందర్, కోశాధికారి జి.వీరన్న, జాయింట్ సెక్రటరీ కృష్ణారెడ్డి, ికుర్తా కార్యవర్గసభ్యులు ప్రొఫెసర్లు సీహెచ్ సమ్మయ్య, సుధాకర్ తదితరులుపాల్గొన్నారు.
కుర్తా అధ్యక్షుడు ప్రొఫెసర్ సదానందం


