దేశ రక్షణకు కాంగ్రెస్‌తో పనిచేస్తాం | - | Sakshi
Sakshi News home page

దేశ రక్షణకు కాంగ్రెస్‌తో పనిచేస్తాం

Jul 25 2026 12:59 AM | Updated on Jul 25 2026 12:59 AM

దేశ రక్షణకు కాంగ్రెస్‌తో పనిచేస్తాం

ఖిలా వరంగల్‌: దేశాన్ని కాపాడేందుకు కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శుక్రవారం వరంగల్‌లోని మార్కండేయ నగర్‌లో నిర్మించిన సీపీఐ కార్యాలయం ఏబీ బర్ధన్‌ భవనాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎండీ ఆయూబ్‌, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనవాసరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి షేక్‌ బాష్‌మియాతో కలిసి కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు. పార్టీ నగరశాఖ కార్యదర్శి ఎండీ అక్బర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అసమర్థ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌, వామపక్షాలు కలిసి పోరాడతాయన్నారు. పేదలు గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారని, వారికి ఇళ్ల పట్టాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. అనంతరం వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలందరికీ పట్టాలిచ్చి ఇందిరమ్మ ఇళ్లు ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీపీఐ నేతలు మేకల రవి, విజయ్‌ సారథి, కర్రె భిక్షపతి,, జ్యోతి, మంజుల, రమేశ్‌, భిక్షపతి, దండు లక్ష్మణ్‌, పనాస ప్రసాద్‌, బద్రి, గన్నారపు రమేశ్‌, బుస్స రవీందర్‌, చెన్న కేశవులు, ఎలేందర్‌, శంకరయ్య, భవాని, కుమార్‌, రంజిత్‌, తస్లీమ్‌ తదితరులు పాల్గొన్నారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

ఘనంగా ఏబీ బర్ధన్‌ భవనం ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement