జూనియర్‌ సివిల్‌ జడ్జిలకు పదోన్నతులు | - | Sakshi
Sakshi News home page

జూనియర్‌ సివిల్‌ జడ్జిలకు పదోన్నతులు

Jul 25 2026 12:59 AM | Updated on Jul 25 2026 12:59 AM

జూనియర్‌ సివిల్‌ జడ్జిలకు పదోన్నతులు నేషనల్‌ పవర్‌ లిఫ్టింగ్‌లో కమల్‌కు కాంస్యం డీసీసీ సమన్వయ కమిటీ నియామకం శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం వేయిస్తంభాల ఆలయంలో వరుణ జపం

వరంగల్‌ లీగల్‌: రాష్ట్రవ్యాప్తంగా జూనియర్‌ సివిల్‌ జడ్జిలకు సీనియర్‌ సివిల్‌ జడ్జిలుగా పదోన్నతులు కల్పిస్తూ హై కోర్టు వర్గాలు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశాయి. ఈమేరకు వరంగల్‌ ప్రధాన జూనియర్‌ సివిల్‌ జడ్జి కె.పూజ, హనుమకొండ ప్రధాన జూనియర్‌ సివిల్‌ జడ్జి ప్రతీక్‌ సెహాగ్‌, మొదటి జూనియర్‌ సివిల్‌ జడ్జి టీ.ఎం వైష్ణవికి సీనియర్‌ సివిల్‌ జడ్జిగా పదోన్నతి కల్పించారు.

హసన్‌పర్తి: ఇటీవల మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి మాస్టర్స్‌ క్లాసిక్‌ అండ్‌ ఈక్విస్ట్‌ పవర్‌ లిఫ్టింగ్‌లో హసన్‌పర్తి మండలం భీమారానికి చెందిన సంగాల కమల్‌ కాంస్య పతకం సాధించారు. ఈసందర్భంగా కమల్‌ను హనుమకొండ అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవి అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.

హన్మకొండ చౌరస్తా : జిల్లాలో పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు డీసీసీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసినట్లు హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. చైర్మన్‌గా పింగిలి వెంకట్రాంనరసింహారెడ్డి, కన్వీనర్లుగా కౌటిల్‌రెడ్డి, నాయిని గోదాదేవి, సభ్యులుగా లక్ష్మణ్‌, రాహుల్‌రెడ్డి, దిలీప్‌రాజ్‌, గోవిందు శ్వేత, డాక్టర్‌ రమేశ్‌, అల్లం రఘునారాయణ, పోతుల శ్రీమాన్‌రావు, మరో 13మందితో కమిటీని ఏర్పాటు చేసిననట్లు వివరించారు.

కాజీపేట అర్బన్‌: బీసీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో గ్రూప్‌ 1, 2, 3, 4 బ్యాంకింగ్‌ సర్వీసెస్‌, స్టాఫ్‌ సెలక్షన్‌, ఆర్‌ఆర్‌బీ, పోలీస్‌ నియామక పరీక్షలకు ఫౌండేషన్‌ కోర్సు ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్‌ ఇన్‌చార్జ్‌ డైరెక్టర్‌ లక్ష్మణ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 25 నుంచి ఆగష్టు 14వ తేదీ వరకు www.tgbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 0870–2571192 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

హన్మకొండ కల్చరల్‌: దేవాదాయశాఖ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, దేవాదాయశాఖ కమిషనర్‌ హనుమంతరావు ఆదేశాల మేరకు వేయిస్తంభాల ఆలయంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న వరుణ పూజలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచి రుద్రేశ్వరస్వామికి రుద్రాభిషేకం, సామూహిక రుద్రాభిషేకాలు జరిగాయి. వరుణ పూజల్లో భాగంగా మొదటి ఆలయ నాట్య మండపంలో వేద పండితులు మణికంఠశర్మ, పానుగంటి సాయితేజ, శ్రీవాస్తవ, అర్చకులు ప్రణవ్‌, కాశి లింగాచారి సకాలంలో వర్షాలు పడాలని వరుణ జపం, ఋశ్యశృంగ పారాయణం నిర్వహించారు. నేడు శనివారం తొలి ఏకాదశిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, ఉదయం 7 గంటలకు శత ఘటాభిషేకం ప్రారంభమవుతుందని, అలాగే, రేపు 26న ఆదివారం వరుణ హో మం వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ ఈఓ అనిల్‌కుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement