వరంగల్ అర్బన్: మహానగరంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ టెండర్ ప్రక్రియ తదిదశకు చేరిందని గ్రేటర్ వరంగల్ కమిషనర్ టి.వెంకన్న అన్నారు. శుక్రవారం వరంగల్ జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో యూజీడీ టెండర్ ప్రక్రియ పురోగతిపై ఇంజనీర్లు, ప్లానింగ్ అధికారులు, బిల్డ్ కాన్ సంస్థ ప్రతినిధులతో సమావేశమై చర్చించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగర పరిధిలో ఏర్పాటు చేయనున్న ఏడు ఎస్‌టీపీల (సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు) కోసం అవసరమైన భూసేకరణ పూర్తయిందన్నారు. టెండర్ ప్రక్రియ చివరి దశకు చేరినందున మిగిలిన ప్రక్రియలను వేగంగా పూర్తి చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో బల్దియా సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజ్‌కుమార్, ‘కుడా’ సీపీఓ అజిత్‌రెడ్డి, ఈఈ రవికుమార్, బిల్డ్‌కాన్ సంస్థ ప్రతినిధి అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.
జూ పార్కులో నీటి నిల్వకు శాశ్వత పరిష్కారం
హనుమకొండలోని కాకతీయ జులాజికల్ పార్కు నుంచి వర్షాకాలంలో వరద నీటితో పలు ప్రాంతాలు ముంపు గురవుతున్న నేపథ్యంలో కమిషనర్ టి.వెంకన్న, జిల్లా అటవీ శాఖ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శాశ్వత పరిష్కారం కోసం సమగ్ర ప్రణాళిక రూపొందించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఇంజనీర్లను ఆదేశించారు. ఆయన వెంట ఎస్‌ఈ రాజుకుమార్, ఈఈ రవికుమార్, అసిస్టెంట్ క్యూరేటర్ మయూరి, బల్దియా డీఈలు, ఏఈలు, అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌టీపీల ప్రతిపాదనలపై సీరియస్‌గా దృష్టిసారించాలి
గ్రేటర్ వరంగల్ కమిషనర్ వెంకన్న


