నగరంపై పొగమంచు దుప్పటి
వరంగల్ మహానగరంపై పొగమంచు దుప్పటేసింది. శుక్రవారం ఉదయం 10:30 గంటల వరకు వీడలేదు. పక్కపక్కనే ఉన్నా మనిషికి మనిషి కనిపించనంత మేర దట్టంగా పొగమంచు కురిసింది. ప్రధాన రహదారులతోపాటు అంతర్గత రోడ్లలోనూ వెలుతురు సరిగ్గా లేక వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణాలు సాగించారు. ఖిలావరంగల్ శిల్పాల ప్రాంగణం, ఖుష్‌మహల్, వేయిస్తంభాల గుడి, శ్రీభద్రకాళి దేవాలయం తదితర ప్రదేశాల్లో పొగమంచు దృశ్యాలను నగరవాసులు ఫొటోలు తీసుకున్నారు.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్లు, హన్మకొండ/వరంగల్


