పైడిపల్లి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు | - | Sakshi
Sakshi News home page

పైడిపల్లి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు

Jan 3 2026 6:40 AM | Updated on Jan 3 2026 6:40 AM

పైడిప

పైడిపల్లి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు

పైడిపల్లి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు ‘పింగిళి’లో కథా సర్టిఫికెట్‌ కోర్సు షురూ

వరంగల్‌: వరంగల్‌ మండలం పైడిపల్లి దర్గాను కలెక్టర్‌ సత్యశారద, అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, ఆర్డీఓ సుమ శుక్రవారం సందర్శించారు. ఉర్సును పురస్కరించుకుని వారు ప్రత్యేక ప్రార్థనలు చేసి హజరత్‌ నూరొద్దీన్‌బాబాను దర్శించుకున్నారు. దర్గా విశిష్టతను మత పెద్దలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులు చాదర్‌ సమర్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు శ్రీకాంత్‌, ఇక్బాల్‌ తదితరులు పాల్గొన్నారు.

విద్యారణ్యపురి: హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో ‘సృజనాత్మక రచన, కథ’ అంశంపై సర్టిఫికెట్‌ కోర్సును ముఖ్య అతిథిగా హైదరాబాద్‌ ప్రెస్‌ బ్యూరో డైరెక్టర్‌ కోటేశ్వర్‌రావు శుక్రవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కథలు మానవ జీవితాన్ని ప్రతిబింబింపజేస్తాయన్నారు. కార్యక్రమంలో ఆకళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య చంద్రమౌళి, తెలుగు విభాగాధిపతి ఎస్‌.మధు, అధ్యాపకులు లక్ష్మీకాంతం, రామా రత్నమాల, సునీత, రామాకృష్ణారెడ్డి, మాధవి, యుగేంధర్‌, రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

రివిజన్‌ ఇలా ఉంటుందా?

ఉపాధ్యాయుల పనితీరుపై

కలెక్టర్‌ అసహనం

ఎంజేపీ విద్యాలయం సందర్శన

హసన్‌పర్తి: ‘ఉపాధ్యాయులు ఏమీ చెప్పకుండా విద్యార్థులే కూర్చుని చదవడాన్ని రివిజన్‌ అంటున్నారు.. అసలు రివిజన్‌ ఇలా ఉంటుందా’ అని హనుమకొండ కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హసన్‌పర్తి మండల కేంద్రంలో కొనసాగుతున్న మహాత్మాజ్యోతి రావు పూలే(కాజీపేట) విద్యాలయాన్ని శుక్రవారం ఆమె సందర్శించారు. విద్యార్థులు రౌండ్‌గా కూర్చుని చదువుతుండగా కలెక్టర్‌ ఏం చేస్తున్నారని ప్రశ్నించగా రివిజన్‌ అని చెప్పారు. కలెక్టర్‌ ఇలా చేస్తే రివిజన్‌ అవుతుందా? అంటూ అక్కడే ఉన్న ఉపాధ్యాయురాలిని మందలించారు. ప్రతీ రోజు ఒక్కో చాప్టర్‌ చొప్పున ఉపాధ్యాయులే రివిజన్‌ చేయాలని సూచించారు. ప్రతీ తరగతిలో ఇలాగే కొనసాగించాలని చెప్పారు. విద్యార్థులను పలు ప్రశ్నలు వేయగా సమాధానం చెప్పలేకపోవడంతో కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరితో బోర్డుపై పదాలు రాయించారు. సరిగ్గా రాయకపోవడంతో ఉపాధ్యాయుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌, ఆర్‌ఐలు ఫాజిల్‌, రాజేంద్రప్రసాద్‌, ఎంజేపీ ఆర్‌సీఓ రాజ్‌కుమార్‌, ప్రిన్సిపాల్‌ ప్రపుల్లా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పీఏసీఎస్‌ సిబ్బంది పనితీరుపై ఆగ్రహం

ఎంజేపీ నుంచి కలెక్టర్‌ నేరుగా స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి వెళ్లారు. రికార్డుల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రికార్డులు అప్డేట్‌ లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిలేనప్పుడు ఇంతమంది సిబ్బంది కొనసాగించడం ఎందుకని ప్రశ్నించారు. కార్యక్రమంలో డీసీఓ సంజీవరెడ్డి, తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌, సొసైటీ ఇన్‌చార్జ్‌ అధికారి జగన్మోహన్‌రావు, ఆర్‌ఐలు ఫాజిల్‌, రాజేంద్రప్రసాద్‌, ఏఓ అనురాధ పాల్గొన్నారు.

పైడిపల్లి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు1
1/2

పైడిపల్లి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు

పైడిపల్లి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు2
2/2

పైడిపల్లి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement