
బోధన నైపుణ్యాలు పెంపొందించుకోవాలి
కేయూ క్యాంపస్: అధ్యాపకులు బోధన నైపుణ్యాలు పెంపొందించుకోవాలని కేయూ రిజి స్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం కోరారు. గురువారం క్యాంపస్‌లోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాలలోని సెమినార్ హాల్‌లో ‘డేటా డ్రివెన్ టీచింగ్ బిజినెస్ అనాలటిక్స్ అండ్ పవర్ బి ఐ ఫర్ ఎడ్యుకేటర్స్’ అనే అంశంపై మూడు రోజుల వర్క్‌షాపు నిర్వహించారు. మొదటి రోజు ప్రారంభ సమావేశా నికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అధ్యాపకులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బోధన నైపుణ్యాలను అప్‌గ్రేడ్ చేసుకోవాలన్నారు. అనంతరం కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం ప్రిన్సిపాల్ ఆచార్య అమరవేణి, డీన్ ఆచార్య రాజేందర్, బీఓఎస్ చైర్మన్ ఆచార్య వరలక్ష్మి మాట్లాడారు. వర్క్‌షాప్‌లో డాక్టర్ ఫణీంద్ర, డాక్టర్ ప్రగతి, వివిధ కళాశాలల అధ్యాపకులు పాల్గొన్నారు.
కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం