హనుమకొండ పరేడ్ గ్రౌండ్స్‌లో..
హన్మకొండ అర్బన్: తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా హనుమకొండలోని పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌ను ముస్తాబు చేశారు. జిల్లా యంత్రాంగం వేడుకలకు అవసరమైన ఏర్పాట్లు చేసింది. హనుమకొండలో జరిగే వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఉదయం 9.40 గంటలకు హనుమకొండ అదాలత్‌లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన అనంతరం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అమరుల కుటుంబాలకు సత్కారం తదితర కార్యక్రమాలు ఉంటాయి. అవతరణ వేడుకల సందర్భంగా కలెక్టరేట్, టౌన్‌హాల్ తదితర భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, జిల్లా ప్రముఖులను కలెక్టర్ ప్రావీణ్య ఆహ్వానించారు.
హనుమకొండ పరేడ్ గ్రౌండ్స్‌లో..


