సోమవారం శ్రీ 5 శ్రీ మే శ్రీ 2025
– 10లోu
హనుమకొండ, వరంగల్‌లో 97.73 శాతం హాజరు
● ఎగ్జామ్ సెంటర్లకు ముందే చేరుకున్న విద్యార్థులు
● రెండు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, సీపీ
విద్యారణ్యపురి: వైద్య విద్య కోర్సుల్లో చేరడానికి ఆదివారం నిర్వహించిన జాతీయ స్థాయి అర్హత పరీక్ష ‘నీట్’(యూజీ 25) ప్రశాంతంగా ముగిసింది. హనుమకొండ, వరంగల్‌లో కలిపి 11 సెంటర్లు కేటాయించగా.. ఉదయం 11 గంటల నుంచే విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించి లోనికి అనుమతించా రు. ఎక్కువశాతం ముందే సెంటర్లకు చేరుకోగా.. అక్కడక్కడా ఉరుకుల పరుగుల మీద వచ్చారు. ప్రధానంగా విద్యార్థినులకు సంబంధించి చెవుల దుద్దులు, ముక్కుపుడకలు, కాళ్ల పట్టీలు, చేతులకు ఉన్న దారాలను తీయించాకే అనుమతించారు. అడ్మిట్ కార్డు, ఐడెంటిటీ ప్రూఫ్ చెక్ చేసి బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకున్నారు. మధ్యాహ్నం 1.30 గంటల తరువాత సెంటర్ల గేట్లు మూసివేసి ఆ తర్వాత వచ్చిన వారిని లోనికి అనుమతించలేదు. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. హనుమకొండ, వరంగల్‌లో కలిపి 4,680 మంది విద్యార్థులకు 4,574 మంది(97.73 శాతం) పరీక్ష రాశారు. హనుమకొండ సుబేదారిలో ని యూనివర్సిటీ పీజీ కళాశాల, కడిపికొండ శివారు కేంద్రీయ విద్యాలయం సెంటర్లను హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య సందర్శించారు. సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, హనుమకొండలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సెంటర్లను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ సందర్శించి భద్రత ఏర్పాట్లను పరిశీలించారు.
న్యూస్‌రీల్
సోమవారం శ్రీ 5 శ్రీ మే శ్రీ 2025
సోమవారం శ్రీ 5 శ్రీ మే శ్రీ 2025
సోమవారం శ్రీ 5 శ్రీ మే శ్రీ 2025
సోమవారం శ్రీ 5 శ్రీ మే శ్రీ 2025
సోమవారం శ్రీ 5 శ్రీ మే శ్రీ 2025
సోమవారం శ్రీ 5 శ్రీ మే శ్రీ 2025


