కార్మికులను బానిసలుగా మార్చే కుట్ర
ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్
వరంగల్: కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం.. కార్మికులను కట్టు బానిసలుగా చేసేందుకే నాలుగు లేబర్‌కోడ్‌లను అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్ అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్‌టీయూ) నిర్మాణ జనరల్ బాడీ సమావేశాన్ని జిల్లా అధ్యక్షుడు గంగుల దయాకర్ అధ్యక్షతన పోచమ్మమైదాన్‌లోని విస్‌డమ్ కళాశాలలో ఆదివారం నిర్వహించారు. ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాచర్ల బాలరాజు, పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి మహేష్, పీవైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కానుగుల రంజిత్ తదితరులు మాట్లాడారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గంగుల దయాకర్, ఉపాధ్యక్షులుగా సీహెచ్.నర్సింగం, బరిగెల కుమార్ ప్రధాన కార్యదర్శిగా ఎలకంటి రాజేందర్, సహాయ కార్యదర్శులుగా బండి కుమార్, బన్న నర్సింగం, కోశాధికారిగా గొర్రె ప్రదీప్‌తోపాటు 15 మంది జిల్లా కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.


