అర్జీలను తక్షణమే పరిష్కరించండి
వరంగల్: ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి డీఆర్‌ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సత్యపాల్‌రెడ్డి, ఉమారాణీతో కలిసి జిల్లావ్యాప్తంగా ప్రజల నుంచి పలు సమస్యలపై మొత్తం 120 దరఖాస్తులు వచ్చాయి. వాటిని సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. నేటి ప్రజావాణిలో అధిక మొత్తంలో రెవెన్యూ శాఖ, కలెక్టరేట్‌కి సంబంధించిన దరఖాస్తులు వచ్చాయి. అందులో రెవెన్యూశాఖకు 45, కలెక్టరేట్ పరిపాలన విభాగానికి 14, హౌజింగ్‌కు 8 రాగా.. మిగతా దరఖాస్తులు వివిధ ప్రభుత్వ శాఖ లకు చెందినవి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ప్రజావాణి వేళలు మార్పు చేయాలి..
వేసవికాలంతో ఎండలు ముదరడం వల్ల ప్రతీ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం వేళల్లో మార్పు చేయాలని పలువురు కలెక్టర్‌ను విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు మధ్యాహ్నం తిరిగి వెళ్లాలంటే ఎండ తీవ్రతతో వడదెబ్బలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అందువల్ల ఈవేసవికాలం వెళ్లే దాకా ఉదయం 9 నుంచి 11 గంటల వరకు నిర్వహిస్తే ఎండ తీవ్రతలు పెరగక ముందే ఇంటికి చేరుకునేందుకు బాగుంటుందని పలువురు సూచిస్తున్నారు.
అధికారులను ఆదేశించిన అదనపు కలెక్టర్ సంధ్యారాణి
ప్రజావాణిలో ఫిర్యాదుల స్వీకరణ


