విద్యారణ్యపురి: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని విద్యాశాఖ టీఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్‌ఆర్ రాజ్‌కుమార్ అన్నారు. ఆదివారం ఆసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ ఫకృద్దీన్ అహ్మద్ ఇతర బాధ్యులతో కలిసి హనుమకొండలోని డీఈఓ కార్యాలయం వద్దకు వచ్చారు. ఈసందర్బంగా ఆయా ఉద్యోగులతో మాట్లాడారు. వివిధ సమస్యలపై సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు. ఈసందర్భంగా రాజ్‌కుమార్‌ను, ఫకృద్దీన్ అహ్మద్‌ను విద్యాశాఖ ఉద్యోగులు సన్మానించారు. కార్యక్రమంలో ఆసంఘం రాష్ట్ర కోశాధికారి పవన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్, బాధ్యులు జె.రాజేశ్వర్‌రావు, ఎండీ అలీం, ఎండీ జాకీర్, ఎస్.శ్రీనివాస్, బి.హరీశ్, ఎఫ్‌ఏఓ మధుసూదన్‌రెడ్డి వివిధ జిల్లాల బాధ్యులు పాల్గొన్నారు.