
ఐకమత్యంతో అన్ని సాధించవచ్చు
వరంగల్: సమాజంలో ఐకమత్యంతో ఉంటే అన్ని రంగాల్లో ఫలితాలను సాధించవచ్చని కల్యాణినగర్ వెల్పేర్ అసోసియేషన్ అధ్యక్షుడు గోలి చెన్నారెడ్డి అన్నారు. ఆదివారం దేశాయిపేటలోని కల్యాణి నగర్ కాలనీ వాసులు అరేపల్లి సమీపంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్‌హాల్‌లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈసందర్భంగా కాలనీలోని కుటుంబ సభ్యులంతా ఆనందంగా గడిపారు. అనంతరం కాలనీలోని కుటుంబ సభ్యులకు బహుమతులు అందజేశారు. కాలనీ పెద్దలు, కల్యాణి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, కోశాధికారి మధుసూదన్, గౌరవ అధ్యక్షుడు హరినాథ్, సలహాదారులు మల్లారెడ్డి, కాలనీ వాసులు పాల్గొన్నారు.