
సీపీని కలిసిన కలెక్టర్ సత్యశారద
వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సన్‌ప్రీత్‌సింగ్‌ను వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. మొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు.
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
కాళోజీ సెంటర్: ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ డీఆర్‌ఓ ఎం.విజయలక్ష్మి అన్నారు. జిల్లాలోని ప్రత్యేక అవసరాల పిల్లలకు వరంగల్ శంభునిపేట పాఠశాలలో అలింకో కంపెనీ సహకారంతో శనివారం ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ మాట్లాడుతూ సమగ్రశిక్ష ద్వారా ఉచిత ఉపకరణాలు అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ సమగ్రశిక్ష కోఆర్డినేటర్ కుడికాల సుభాష్, కార్పొరేటర్ పోశాల పద్మస్వామి, ఖిలా వరంగల్ ఎంఈఓ బి.ప్రసాద్, స్థానిక పాఠశాల హెచ్‌ఎం శారదాబాయి, ఉన్నత పాఠశాల హెచ్‌ఎం ప్రకాశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.