Telangana Assembly Elections 2023: ఎన్నికలంటే ఇంతుందా..!

- - Sakshi

వివిధ స్థాయిల్లో ఎన్నికల అధికారుల విధులు

బూత్‌ లెవెల్‌ నుంచి జిల్లాస్థాయి వరకు..

ఎన్నికల ప్రక్రియ సజావుగా పూర్తయ్యేందుకు చర్యలు

హనమకొండ: ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల ప్రక్రియ అత్యంత ప్రధానమైనది. ప్రతీ ఐదు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఎన్నికల్లో పౌరుడు తన ఓటు హక్కుతో నచ్చిన నేతను ప్రజాప్రతినిధిగా ఎన్నుకుంటాడు. ఈ నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి నుంచి మొదలు.. గ్రామస్థాయిలోని పోలింగ్‌ బూత్‌ లెవల్‌ అధికారి (బీఎల్వో) వరకు సమన్వయంతో విధులు నిర్వహిస్తేనే ఎన్ని కల ప్రక్రియ సజావుగా పూర్తవుతుంది.

ఎక్కడ ఏ చిన్న లోపం ఏర్పడినా ఎన్నికల నిర్వహణకు ఆటంకం కలుగుతుంది. బరిలో ఉన్న అభ్యర్థులు నామినేషన్‌ పత్రాల దాఖలు మొదలు... ఎన్నికల నియమావళి అమలు, పోలింగ్‌ ప్రక్రియ, ఓట్ల లెక్కింపు, ఫలి తాల వెల్లడి వరకు అధికారులు బాధ్యతతో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. తాజాగా తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో జిల్లా స్థాయి అధికారులు వారి ఉన్నతాధికారులు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించే పనిలో నిమగ్నమై ఉన్నారు.

ఈ నేపథ్యంలో జిల్లా స్థాయి ఎన్నికల అధికారి (కలెక్టర్‌) నుంచి.. బూత్‌ లెవెల్‌ అధికారి (బీఎల్వో) వరకు.. వివిధ స్థాయిలోని ఎన్నికల అధికారుల విధుల గురించి తెలుసుకుందాం..

జిల్లా ఎన్నికల అధికారి
జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టర్‌ బాధ్యతలు నిర్వర్తిస్తారు. మిగతా ఎన్నికల నిర్వహణ అధికారులు కలెక్టర్‌ ఆధ్వర్యంలో సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. కిందిస్థాయి అధికారులకు విధులు కేటాయిస్తూ నిరంతరం సమీక్షలు జరుపుతారు. అధికారుల అందరికీ దిశానిర్దేశం చేస్తారు. జిల్లాస్థాయిలో కావాల్సిన శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి వాటిని పర్యవేక్షిస్తారు. ఓటరు జాబితా రూపకల్పన మొదలు.. ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడి పూర్తయ్యే వరకు.. జిల్లా ఎన్నికల అధికారిదే పూర్తి బాధ్యత.

రిటర్నింగ్‌ అధికారి
రిటర్నింగ్‌ అధికారి నియోజకవర్గానికి ఒకరు ఉంటారు. వీరిని ఆయా నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల కమిషన్‌ నియమిస్తుంది. తమ పరిధిలోని ఎన్నికల ప్రక్రియను వీరు పర్యవేక్షిస్తారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, తిరస్కరణ, అభ్యర్థుల తుది జాబితా ప్రకటన, పోలింగ్‌ కేంద్రాలు, సిబ్బంది నియామకం, శిక్షణ, ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి, వసతుల కల్పన, తదితర అంశాలు వీరి పరిధిలో ఉంటాయి.

సెక్టోరియల్‌ అధికారి
ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగడానికి సెక్టోరియల్‌ అధికారులు కీలక పాత్ర పోషిస్తారు. ముఖ్యంగా పోలింగ్‌ బూత్‌ల పర్యవేక్షణ బాధ్యతలు చూస్తారు. ఒక్కొక్కరి పరిధిలో దాదాపు 6 నుంచి 9 పోలింగ్‌ కేంద్రాలు ఉంటాయి. వాటిలో ర్యాంపుల ఏర్పాటు, తాగునీటి వసతి, ఫర్నీచర్‌, విద్యుత్‌, లైట్లు, ఫ్యాన్లు, వంటి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్‌ నిర్వహణ జరిగేలా చూస్తారు. తమ పరిధిలో జరిగే అంశాలకు వీరే బాధ్యత వహిస్తారు.

ప్రిసైడింగ్‌ అధికారి
ప్రతీ పోలింగ్‌ కేంద్రానికి ఒక ప్రిసైడింగ్‌ అధికారి ఉంటారు. ఆ పోలింగ్‌ కేంద్రం పరిధిలో జరిగే అన్ని విషయాలకు అతడిదే సంపూర్ణ బాధ్యత. ఓటింగ్‌కు అవసరమైన ఈవీఎంలు, వీవీప్యాట్లు, ఇతర సామగ్రి తీసుకొస్తారు. పోలింగ్‌ అనంతరం ఎన్నికల సామగ్రిని తిరిగి నియోజకవర్గస్థాయి స్ట్రాంగ్‌ రూమ్‌కు చేరుస్తారు. వీరికి సహాయకంగా అదనపు ప్రోసీడింగ్‌ అధికారి ఉంటారు.

పోలింగ్‌ కేంద్రాల్లో జరిగే కార్యకలాపాలాన్నీ వీరి పర్యవేక్షణలోనే ఉంటాయి. ఎన్నికల సంఘం రూపొందించిన నియమావళికి అనుగుణంగా వీరు పనిచేస్తారు. వీరితోపాటు మరో ఇద్దరు పోలింగ్‌ అధికారులు పనిచేస్తారు. పోలింగ్‌ బూత్‌లలోని ఈవీఎంల పనితీరు, ఇతర కార్యకలాపాలకు వీరిదే బాధ్యత.

ఓటు నమోదు అధికారులు
బూత్‌ స్థాయి అధికారులు అందించిన సమాచారంతో ఓటరు జాబితాను తయారు చేయడం వీరి ప్రధాన బాధ్యత. కొత్తగా ఓటు నమోదు చేసుకునే వారు జాబితాలో పేర్లు సరిచేసుకునేవారు ఈ అధికారిని సంప్రదించాల్సి ఉంటుంది. తుది ఓటరు జాబితా రూపకల్పనలో వీరిదే ప్రధాన పాత్ర.

బూత్‌ లెవెల్‌ అధికారులు
ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో గ్రామస్థాయిలో పనిచేసే వారే బూత్‌ లెవెల్‌ అధికారులు(బీఎల్‌వోలు). గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన యువత, ఓటు హక్కుకు అర్హులైన వారిని ఓటు నమోదు చేసుకునేలా వీరు అవగాహన కల్పిస్తారు.

కావాల్సిన దరఖాస్తులు వీరి వద్ద ఉంటాయి. పూర్తి చేసిన దరఖాస్తులను స్వీకరించి నమోదు చేసిన అనంతరం తుది జాబితా ప్రదర్శన, పోలింగ్‌ కేంద్రాల మార్పునకు సంబంధించి ఉన్నతాధికారులకు సహకరించడం వీరి ప్రధాన బాధ్యత.

Read latest Hanamkonda News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

17-11-2023
Nov 17, 2023, 11:59 IST
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు గడువు దగ్గర పడుతుండడంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని పరిగెత్తిస్తున్నాయి. ఎన్నికల్లో ప్రధాన ఘట్టానికి రెండు...
17-11-2023
Nov 17, 2023, 11:49 IST
సాక్షి, నిజామాబాద్‌: 58 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో ఎన్నో గోసలు పడ్డాం. బలవంతంగా మనల్ని ఆంధ్రాలో కలిపిండ్రు. ఎన్నో పోరాటాల అనంతరం...
17-11-2023
Nov 17, 2023, 10:14 IST
సాక్షి, ఆదిలాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులకు కామన్‌ సింబల్‌ ఉండగా వారు ఇప్పటికే...
17-11-2023
Nov 17, 2023, 09:55 IST
సాక్షి, ఆదిలాబాద్‌: ‘కరెంట్‌ కావాల్నా.. కాంగ్రెస్‌ కావాల్నా.., రైతుబంధు కావాల్నా.. రాబందా?..’ అంటూ సీఎం కేసీఆర్‌ ప్రజాఆశీర్వాద సభల్లో సభికులను...
17-11-2023
Nov 17, 2023, 08:37 IST
సాక్షి, హైదరాబాద్‌: ఎన్ని సంస్కరణలు తెచ్చినా..ఎన్నిమార్లు సవరణలు చేసినా..ఎంత మంది ఫిర్యాదులు చేసినా ఓటరు లిస్టులో మాత్రం తప్పుల్ని నివారించలేకపోతున్నారు....
17-11-2023
Nov 17, 2023, 08:04 IST
ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరగాలంటే రాష్ట్ర పోలీసులతో పాటు సాయుధ దళాల బందోబస్తు కూడా ఎంతో ముఖ్యం. ఆ...
17-11-2023
Nov 17, 2023, 04:44 IST
సాక్షి, హైదరాబాద్‌: ఈనెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 28,057 మందికి పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం...
17-11-2023
Nov 17, 2023, 04:31 IST
సాక్షి, ఆదిలాబాద్‌/ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌/ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:  పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో బీదాబిక్కీ, చిన్నాపెద్ద, కులమతా లకు...
17-11-2023
Nov 17, 2023, 03:39 IST
చెరుపల్లి వెంకటేశ్‌: కార్పొరేటర్‌ నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఎదిగిన వారెందరో ఉన్నారు. హైదరాబాద్‌ బల్దియా నుంచే ఇలా ఎదిగిన వారూ  చాలామంది...
17-11-2023
Nov 17, 2023, 03:02 IST
యెన్నెల్లి సురేందర్‌ : మలివిడత తెలంగాణ ఉద్యమ కాలం నుంచి 2021వరకు ఎంతో సాన్నిహిత్యం, అనుబంధం ఉన్న సీఎం కేసీఆర్, మాజీ...
17-11-2023
Nov 17, 2023, 01:24 IST
కరీంనగర్‌/కరీంనగర్‌ రూరల్‌: కరీంనగర్‌ ప్రజల ఆశీర్వాదం, సీఎం కేసీఆర్‌ సహకారంతో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని, నమ్మకాన్ని వమ్ము చేయకుండా పదేళ్లలో...
17-11-2023
Nov 17, 2023, 01:24 IST
కరీంనగర్‌టౌన్‌: కరీంనగర్‌ను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కేంద్రంతో మాట్లాడి స్మార్ట్‌ సిటీ కింద నిధులు తీసుకొస్తే ఎవడబ్బ సొమ్మని బీఆర్‌ఎస్‌...
17-11-2023
Nov 17, 2023, 01:22 IST
మంచిర్యాలక్రైం: ఎన్నికల వేళ మావోయిస్టు లేఖలు కుమురంభీం జిల్లాలో కలకలం సృష్టిస్తున్నాయి. ఈ నెల 14న భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు)...
17-11-2023
Nov 17, 2023, 01:22 IST
సాక్షి, కామారెడ్డి: 'వీఐపీ అభ్యర్థులు బరిలో ఉన్న కామారెడ్డి నియోజకవర్గంలో ‘బిగ్‌’ ఫైట్‌ నడుస్తోంది. ఇక్కడ 39 మంది పోటీలో...
17-11-2023
Nov 17, 2023, 01:20 IST
కరీంనగర్‌ అర్బన్‌: ఎన్నికలొచ్చాయంటే చాలు.. వివిధ రకాల పేర్లు డోలయమానంలో పడేస్తుంటాయి. అర్థం తెలియక అవగాహన లేని వారెందరో. ప్రిసైడింగ్‌...
17-11-2023
Nov 17, 2023, 01:20 IST
సారంగాపూర్‌(జగిత్యాల): ఓటర్లను మభ్యపెట్టి, తాయిళాలు ఇచ్చి, ఓటు వేయించేందుకు ప్రయత్నిస్తే కఠినచర్యలు తీసుకుంటామని డీఎస్సీ వెంకటస్వామి హెచ్చరించారు. సారంగాపూర్‌ మండలంలోని...
17-11-2023
Nov 17, 2023, 01:00 IST
నిర్మల్‌చైన్‌గేట్‌: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని ఏఐసీసీ...
17-11-2023
Nov 17, 2023, 01:00 IST
నిర్మల్‌: ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు అధి కారికంగా గుర్తుల కేటాయింపు ఖరారైంది. బీఫాంలను అందించిన ప్రధాన పార్టీలకు ముందే...
17-11-2023
Nov 17, 2023, 00:39 IST
సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల ప్రచారం హోరెత్తుతోంది. నామినేషన్ల ఉపసంహరణ పూర్తయి...
17-11-2023
Nov 17, 2023, 00:38 IST
ఆర్మూర్‌: సార్వత్రిక ఎన్నికల్లో ఆర్మూర్‌ నియోజకవర్గంలో ముక్కోణపు పోటీ నెలకొననుంది. నామినేషన్లు, ఉపసంహరణల అనంతరం 13 మంది అభ్యర్థులు బరిలో... 

Read also in:
Back to Top