ఆపస్‌ జిల్లా కార్యవర్గం ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

ఆపస్‌ జిల్లా కార్యవర్గం ఎన్నిక

Nov 17 2026 3:44 AM | Updated on Nov 17 2026 3:44 AM

ఆపస్‌ జిల్లా కార్యవర్గం ఎన్నిక

గుంటూరు ఎడ్యుకేషన్‌ ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘ (ఆపస్‌) గుంటూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కంభంపాటి శ్రీనివాసరావు, యేరువ రామకృష్ణప్రసాద్‌ ఎన్నికయ్యారు. సోమవారం అరండల్‌పేటలోని యోగి భవన్‌లో ఆపస్‌ జిల్లా కార్య నిర్వాహక సమావేశాన్ని రాష్ట్ర మహిళా కార్యదర్శి పమిడిమర్రి పద్మ అధ్యక్షతన నిర్వహించారు. జిల్లా ఆర్థిక కార్యదర్శిగా ఎన్‌.శ్రీనివాసరావు, మహిళా అధ్యక్షురాలిగా డేగల శివపార్వతి ఎన్నికయ్యారు. ఎన్నికల పరిశీలకునిగా సంఘ సీనియర్‌ నాయకుడు మన్నేపల్లి మోహన్‌కృష్ణ, ప్రత్యేక ఆహ్వానితుడిగా వై.సుబ్బారావు వ్యవహరించారు. సమావేశంలో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.శ్రీనివాసరావు, జిల్లా ఉపాధ్యక్షుడు డి.రామాంజనేయులు, ఎం.కిరణ్‌కుమార్‌, మల్లేశ్వరరావు, టి.శ్రీనివాసరావు, టి.నాగమల్లేశ్వరరావు, కె.రవి, టి. వెంకటేశ్వర్లు, పి.వీరాంజనేయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement