కొల్లిపర జెడ్పీటీసీగా సూర్యకుమారి విజయం | - | Sakshi
Sakshi News home page

కొల్లిపర జెడ్పీటీసీగా సూర్యకుమారి విజయం

Nov 8 2026 4:41 AM | Updated on Nov 8 2026 4:41 AM

కొల్లిపర జెడ్పీటీసీగా సూర్యకుమారి విజయం

కొల్లిపర: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు తొక్కని అడ్డదారుల్లేవు. మున్సిపల్‌ ఎన్నికలతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ఇదే తంతు కొనసాగింది. చివరకు ఓట్ల లెక్కింపు రోజున కూడా కుతంత్రాలను వదల్లేదు. అన్ని కుట్రలను ఛేదించుకుని కొల్లిపర జెడ్పీటీసీగా గుదిబండి సూర్యకుమారి విజయం సాధించారు. తెనాలిలోని ఎన్‌వీఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో శనివారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ నిర్వహించారు. కొల్లిపర మండలంలో 16 ఎంపీటీసీ స్థానాలకుగాను 11 స్థానాలను కూటమి కై వసం చేసుకుంది. మిగిలిన ఐదు స్థానాల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు గెలుపొందారు. జెడ్పీటీసీ స్థానాన్ని కూడా వైఎస్సార్‌ సీపీ కై వసం చేసుకుంది. తొలుత జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో జనసేన పార్టీ అభ్యర్థి అమ్మశెట్టి లక్ష్మీరేఖపై వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి గుదిబండి సూర్యకుమారి 160 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. అధికారులు ఆ ఫలితాన్ని పెండింగ్‌లో ఉంచారు. సమాచారాన్ని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌కు చేరవేశారు. కొద్దిసేపటికే మంత్రి మనోహర్‌ పీఏ కౌంటింగ్‌ కేంద్రానికి చేరుకున్నారు. కూటమి నాయకులు వెంటనే రీకౌంటింగ్‌కు డిమాండ్‌ చేశారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో 800 వరకు చెల్లని ఓట్లు ఉన్నాయని, వాటిని తిరిగి లెక్కించాలని పట్టుబట్టారు. ఇందుకు వైఎస్సార్‌ సీపీ కౌంటింగ్‌ ఏజెంట్లు అభ్యంతరం తెలిపారు. అయినప్పటికీ ఉన్నతాధికారుల అనుమతి తీసుకుని రీకౌంటింగ్‌ నిర్వహించారు. రీకౌంటింగ్‌లో మరో ఆరు ఓట్లు పెరగడంతో సూర్యకుమారి 166 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement