ప్రజలు అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Nov 4 2026 2:08 AM | Updated on Nov 4 2026 2:08 AM

నేడు కూడా భారీ వర్షాలు వరదలు వచ్చే ప్రమాదం జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ

గుంటూరు వెస్ట్‌: మురసు తుపాను ప్రభావం బుధవారం కూడా కొనసాగుతుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌ నుంచి అధికారులతో మంగళవారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో అన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయన్నారు. వరదలు వచ్చే అవకాశాలు ఉన్నాయని క్షేత్రస్థాయిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పెదనందిపాడు, కాకుమాను, వట్టిచెరుకూరు మండలాల్లో ఆహార సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. అధిక నీటి ప్రవాహం ఉండే వాగులు రాకపోకలు నియంత్రించాలని దీనిని సిబ్బంది పర్యవేక్షణ చేయాలన్నారు. రోడ్లపై కూలిపోయిన వృక్షాలను యుద్ధప్రాతిపదికపై తొలగించారని ఆదేశించారు. ఏపీసీపీడీసీఎల్‌ ఎస్‌ఈ రమేష్‌ మాట్లాడుతూ పెదనందిపాడు, కాకుమాను ప్రాంతాల్లో 14 ఫీడర్లు దెబ్బతిన్నాయన్నారు. పొన్నూరు మండలం బ్రాహ్మణ కోడూరులో రెండు స్తంభాలు పడిపోగా వెంటనే పునరుద్ధరణ చేశామని తెలిపారు. గుంటూరులో 14 కేవీలు బ్రేక్‌ డౌన్‌ అయ్యాయని తెలిపారు. పెదనందిపాడు తహసీల్దార్‌ మాట్లాడుతూ నక్కల వాగు ప్రవాహానికి ఆర్‌ అండ్‌ బీ రహదారి కోతకు గురయ్యిందన్నారు. డీపీఓ సాయికుమార్‌ మాట్లాడుతూ ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు పెదనందిపాడు వస్తున్నాయన్నారు. పెదనందిపాడు–కాకుమాను ఆర్‌ అండ్‌ బీ రహదారి కోతకు గురైందని తెలిపారు.

పునరావాస కేంద్రంలో వసతులు కల్పించండి

పొన్నూరు: మురసు తుఫాన్‌ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా సంయుక్త కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ అన్నారు. మంగళవారం ఆయన పొన్నూరులో పర్యటించి క్షేత్ర స్థాయిలో పరిస్థితులు పరిశీలించారు. ప్రజలు రాబోయే 24 గంటలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర పనులు ఉంటే మినహా ఎవరు బయటకు రావద్దన్నారు. పట్టణ పరిధిలోని పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. తాగునీరు, ఆహారం, వసతులలో ఎలాంటి కొరత లేకుండా చేయాలని అధికారులను ఆదేశించారు. వెంట మున్సిపల్‌ కమిషనర్‌ ఎం. రమేష్‌బాబు, తహసీల్దార్‌ జియావుల్‌హక్‌, అధికారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement