పట్నంబజారు: తెలుగుదేశం పార్టీ గూండాలు మరోసారి చెలరేగిపోయారు. గుంటూరు నగరంలో ఓ డివిజన్లో వైఎస్సార్ సీపీ విజయాన్ని తట్టుకోలేక వైఎస్సార్ సీపీ అభ్యర్థి, పార్టీ శ్రేణులపై దాడికి తెగబడ్డారు. గుంటూరు నగరం లాలాపేట పరిధిలో 12వ డివిజన్‌కు సంబంధిచి వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఫైరోజ్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్న సమయంలో ఓర్చుకోలేని టీడీపీ అభ్యర్థి మావైజ్ భర్త వసీం, ఆలీ, రహీం, జాఫర్, ఖలీల్, రఫీ కుమారుడితో పాటు సుమారు 30 మంది టీడీపీ మూకలు దాడి చేసి వైఎస్సార్ సీపీ శ్రేణులను గాయపరిచారు. జెండా చెట్టు సమీపంలో ఇంటికి వెళ్తున్న కార్పొరేటర్ అభ్యర్థిగా గెలుపొందిన ఫైరోజ్పై దాడికి యత్నించగా, స్థానిక వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నేతలు అడ్డుకున్నారు. దీనిపై వారిపై ఎగబడి ఇష్టానూసారంగా దాడి చేసి కొట్టారు. దీంతో గాయపడిన రహీమ్ అనే వ్యక్తితో పాటు మరి కొంత మంది లాలాపేట పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. టీడీపీ అభ్యర్థి భర్త వసీమ్ గుంటూరు కార్పొరేషన్లో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ మేరకు బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
గుంటూరు లాలాపేటలో ఘటన


