మురసు తుపానుపై అప్రమత్తంగా ఉండాలి
జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ ఐఏపీఎం రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ బి. శ్రీధర్
గుంటూరు మెడికల్: ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పాథాలజిస్ట్స్ అండ్ మైక్రోబయాలజిస్ట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా గుంటూరు వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్, పాథాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ బి.శ్రీధర్ ఎన్నికయ్యారు. పీఎస్‌ఐఎంఎస్ గన్నవరంలో నిర్వహించిన 8వ ఐఏపీఎం రాష్ట్రస్థాయి సదస్సులో ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యా రు. గుంటూరు వైద్య కళాశాలకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కట్టా రమ్య రాష్ట్ర శాఖ కోశాధికారిగా ఎన్నికయ్యారు. ఒకే వైద్య కళాశాలకు చెందిన ఇద్దరు అధ్యాపకులు రాష్ట్ర స్థాయి వైద్య సంఘంలో కీలక పదవులకు ఎన్నిక కావడం విశేషం. గుంటూరు వైద్య కళాశాల అధ్యాపకులు, వైద్యులు వారికి అభినందనలు తెలిపారు. పాథాలజీ, మైక్రోబయాలజీ విభాగాల్లో వైద్య విద్య, పరిశోధన, శాసీ్త్రయ కార్యక్రమాల అభివృద్ధికి వీరి నాయకత్వం దోహదపడుతుందని ఆకాంక్షించారు.
సాఫ్ట్‌బాల్ సీనియర్
బాలికల ఎంపిక
రొంపిచర్ల: రొంపిచర్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉమ్మడి గుంటూరు జిల్లా సాఫ్ట్‌బాల్ సీనియర్ బాలికల ఎంపికలు నిర్వహించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి 50 మంది బాలికలు హాజరయ్యారు. వీరికి పోటీలు నిర్వహించారు. పోటీలను ఉమ్మడి గుంటూరు జిల్లా సాఫ్ట్‌బాల్ సెక్రటరీ పి.సామంత్‌రెడ్డి పర్యవేక్షించారు. పోటీల్లో పాల్గొన్న వారిలో 25 మంది ప్రాబబుల్స్ ఎంపిక చేసినట్లు సామంత్ రెడ్డి తెలిపారు. వారికి పది రోజులపాటు శిక్షణ ఏర్పాటు చేస్తామన్నారు. వారిలో ప్రతిభ కనబర్చిన వారిని ఉమ్మడి గుంటూరు జిల్లా మెయిన్ జట్టుగా ఎంపిక చేస్తామన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు సైదయ్య, ఉపాధ్యాయులు వెంకటేశ్వరరావు, వివిధ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు. స్ట్రాంగ్ రూములకు బ్యాలెట్ బాక్సులు తరలింపు
జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ
గుంటూరు వెస్ట్: ‘మురసు‘ తుపాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ ప్రజలకు సూచించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి ఆదివారం నిర్వహించిన అధికారుల వీడియో సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 100–110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంతో సహా మండల స్థాయి కార్యాలయం వరకు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 08632234014 ఫోన్ నంబర్‌తో కంట్రోల్ రూమ్ పనిచేస్తుందన్నారు. ఇబ్బందులుంటే ప్రజలు సంప్రదించాలని కోరారు. లోతట్టు ప్రాంతాలు, అండర్ పాస్‌ల వద్ద నీరు నిలువ ఉండే అవకాశం ఉందని, ఆ ప్రాంతాల్లో ముందుగానే ఆయిల్ ఇంజిన్‌లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్‌న్స్‌లో జీఎంసీ కమిషనర్ కె మయూర్ అశోక్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.
నెహ్రూనగర్: జీఎంసీ వార్డుల వారీగా వచ్చిన బ్యాలెట్ బాక్సులు, ఇతర ఎన్నికల మెటీరియల్‌ను ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూంలకు తరలించి భద్రపరిచారు. పీఓల నుంచి నిర్దేశిత చెక్ లిస్ట్ ద్వారానే మెటీరియల్ తీసుకోవాలని కమిషనర్ సూచించా రు. మెటీరియల్ అందించేందుకు వచ్చిన సుమారు 6 వేల మందికి అందించిన ఆహారాన్ని కమిషనర్ వారితో కలిసి భుజించి, ఏర్పాట్లు జాగ్రత్తగా చేయాలని సూచించారు. లెక్కింపు కేంద్రాలను తనిఖీ చేసిన ఆయన ఓట్ల లెక్కింపుపై దృష్టి పెట్టాలన్నారు.