చిలకలూరిపేట మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. టీడీపీ నేతలు తెల్లవారుజాము నుంచే అన్ని బూత్‌లను తమ ఆధీనంలోకి తీసుకుని, చుట్టుపక్కల గ్రామాల నుంచి టీడీపీ గూండాలను కర్రలు, రాడ్లతో కాపలాగా పెట్టి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. బూత్‌లలో ఉన్న వైఎస్సార్ సీపీ ఏజెంట్లను బయటకు లాగి చితకబాదారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి తరిమికొట్టారు. పోలింగ్ బూత్‌లను ఆక్రమించుకుని రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. పండరీపురం, సంజీవనగర్ ప్రాంతాలో పోలింగ్ కేంద్రాల వద్ద వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ గూండాలు దాడులకు తెగబడ్డారు. మాజీ మంత్రి విడదల రజినిని హౌస్ అరెస్టు చేసి, వైఎస్సార్ సీపీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులతోపాటు వారి బంధువులను సైతం బూత్‌ల వద్దకు రాకుండా పచ్చమూకలు అడ్డుకున్నాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఇతర గ్రామాల నుంచి వచ్చిన 200 మంది టీడీపీ గూండాలు అన్ని పోలింగ్ కేంద్రాలను ఆక్రమించుకుని, ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లపై సైతం దాడులు చేసి భయానక వాతావరణం సృష్టించారు. అనంతరం యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి విడదల రజిని చిలకలూరిపేటలో అన్ని వార్డులు, చైర్‌పర్సన్ అభ్యర్థికి రీపోలింగ్ నిర్వహించాలని కోరుతూ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.


