వైఎస్సార్‌ సీపీతోనే నగరాభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీతోనే నగరాభివృద్ధి

Oct 27 2026 1:44 AM | Updated on Oct 27 2026 1:44 AM

● నగర ప్రజలకు వైఎస్సార్‌ సీపీ నేతల పిలుపు ● గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో విస్తృత ప్రచారం

గుంటూరు ఎడ్యుకేషన్‌: గుంటూరు నగరాభివృద్ధి కోసం వైఎస్సార్‌ సీపీకి ఎన్నికల్లో పట్టం కట్టాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్‌ సీపీ నేతలు పిలుపునిచ్చారు. సోమవారం 32వ డివిజన్‌ పరిధిలోని అంకమ్మనగర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్‌ సీపీ కార్పొరేటర్‌ అభ్యర్థి షేక్‌ నజీర్‌ రహిమాతో కలసి వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లిన నేతలు ప్రజలను ఆప్యాయం పలుకరించారు. కూటమి సర్కారు రెండున్నరేళ్ల పాలనలో నగరంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పండుగలా కొనసాగిన గత వైఎస్సార్‌ సీపీ పాలనలో జరిగిన మంచిని ప్రజలు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి వచ్చేందుకు కూటమి నేతలు ఇచ్చిన హామీలను విస్మరించారని ఆరోపించారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి హామీలపై నోరు మెదపని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, వారితో పాటు వచ్చే అభ్యర్థులను హామీలను ఎప్పుడు అమలు చేస్తారని నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నిరుద్యోగులకు నెలకు రూ.మూడు వేలు చొప్పున 30 నెలలకు రూ.90 వేలు, ఆడబిడ్డ నిధి కింద 18 నుంచి 59 ఏళ్ల లోపు మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున రూ.45వేలు ఇచ్చే విధంగా కూటమి నేతలతో పాటు అభ్యర్థులను డిమాండ్‌ చేయాలని ప్రజలకు సూచించారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటు వేస్తే హామీలను నెరవేర్చే అవకాశం లేదని, వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులకు ఓటు వేయడం ద్వారా కూటమి ప్రభుత్వంలో కదలిక వస్తుందని, ఇచ్చిన హామీలను అమలు చేయక తప్పని పరిస్థితులు ఎదురవుతాయని అన్నారు. ఎన్నికల ప్రచారంలో పార్టీ నేతలు నిమ్మకాయల రాజనారాయణ, రాతంశెట్టి రామాంజనేయులు, షేక్‌ నజీర్‌, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement