ఏమి చేయాలంటే..
వార్డుల్లో ఉండే నర్సిగ్ సిబ్బంది, శానిటరి ఇన్‌స్పెక్టర్ ఆస్పత్రిలో ఏదైనా పారిశుద్ధ్య సమస్య గుర్తించి త్వరగా క్లియర్ చేయాలి.
శానిటేషన్ సిబ్బంది ఎంత మంది ఉన్నారు. ఎన్ని సార్లు వార్డును శుభ్రం చేశారు. ఎలాంటి క్లీనింగ్ మెటీరియల్ వినియోగించి –పరిశుభ్రం చేస్తున్నారనే, ఏఏ పరికరాలు క్లీనింగ్‌కు వినియోగిస్తున్నారే విషయాలను తరచుగా గమనించాలి.
ఆస్పత్రిలో సెక్యూరిటీ సిబ్బందిపై పర్యవేక్షణ అవసరం.
రోగుల సహాయకుల అనుమతిపై నిఘా ఉండాలి
ప్రభుత్వ సర్వే 53 శాతం మంది రోగుల అభిప్రాయం హాస్పిటల్లో శానిటేషన్‌పై ప్రజల నుంచి వచ్చిన స్పందన మెరుగుపడకపోతే వ్యాధులు కొత్తగా వచ్చే ప్రమాదం పారిశుద్ధ్యం నిర్వహణలో 16వ స్థానం ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలు
మార్కుల కోతలతో సరిపెట్టేస్తున్నారు..
గుంటూరు మెడికల్: పేదల ఆస్పత్రి. కార్పొరేట్ వైద్యం అందుబాటులో ఉంది. జ్వరం నుంచి పెద్ద వ్యాధుల చికిత్సకు అవకాశం ఉంది. ఇక్కడ వైద్యానికి ఎన్నో ఘనతలున్నాయి. ఏ సమస్య వచ్చిన ఉరుకులు.. పరుగులు మీద ఆస్పత్రిలో చేరేపోయే వెసులుబాటు ఉంది. అదే గుంటూరు జనరల్ ఆస్పత్రి. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. దీతో రోగులు ఆందోళన చెందుతున్నారు.
పారిశుద్ధ్య నిర్వహణలో అధ్వానం..
ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చిన రోగికి వ్యాధి నుండి కోలుకోవటంలో మందులు, ఇంజెక్షన్‌లు, ఆహారంతోపాటుగా రోగి ఉండే వాతారణం కూడా చాలా ముఖ్యం. ఆస్పత్రిలో పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే వ్యాధి నుంచి కోలుకోవటంలో జాప్యంతోపాటుగా నూతనంగా వ్యాధులు వచ్చే ప్రమాదముంది. గుంటూరు జీజీహెచ్ పారిశుద్ధ్యంపై ప్రభుత్వ సర్వేలో 16వ స్థానంలో నిలిచింది.
అభిప్రాయ సేకరణ ఎలా అంటే..
ప్రభుత్వం ఆస్పత్రికి వచ్చిన రోగుల ఓపీ చీటీలోని ఫోన్ నంబర్స్‌కు ప్రజాభిప్రాయసేకరణ పేరుతో నాలుగు ప్రశ్నలపై వారి అభిప్రాయం కోరుతోంది. ఈనెల మూడో వారంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల నుంచి సేకరించిన ప్రజాభిప్రాయ సేకరణ వివరాలను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వ ఆస్పత్రిలో పరిశుభ్రత ఎలా ఉంది అనే ప్రశ్నకు గుంటూరు జీజీహెచ్‌లో శానిటేషన్ బాగాలేదని 53 శాతం మంది రోగులు సమాధానం ఇచ్చారు.
ఒకరిపై ఒకరు నెపాలు....
శానిటేషన్ మెరుగుపడకపోవటానికి అధిక సంఖ్యలో రోగుల సహాయకులను సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతిస్తున్నారని సెక్యూరిటీ, శానిటేషన్, పెస్ట్ కంట్రోల్ కాంట్రక్టర్లు ఒకరిపై ఒకరు నెపాలు వేసుకుంటున్నారు. గతంలో అన్నింటికి కలిపి ఒక్కరే కాంట్రాక్టర్ ఉండేవారు. సుమారు పదేళ్ల క్రితం ఎలుకల దాడిలో పసికందు మృతి ఘటనతో ప్రత్యేకంగా కాంట్రాక్టరులను నియమించారు. ప్రస్తుతం మూడుంటికి ముగ్గురు కాంట్రాక్టర్లు, గతంలో కంటే ఎక్కువ నిధులు అందిస్తున్నా వారితో సక్రమంగా పనిచేయించుకోలేక ఆస్పత్రి అధికారులు ఆపసోపాలు పడిపోవటం వలన శానిటేషన్ ర్యాకింగ్‌లో వెనుకబడిపోయారు.
లోపాలు ఏమంటే...
ప్రస్తుతం ఇన్‌పెషెంట్ విభాగంలో పాత కాన్పుల విభాగం, పిల్లల వైద్య విభాగాల మధ్య పనికిరాకుండా విరిగి, తుప్పుపట్టి ఉన్న మంచాలు, పాడైపోయి, చినిగిపోయిన పరుపులు గుట్టలుగా వేసి ఉంచారు. ఇలా వార్డుల మధ్య చెత్తాచెదారం ఉంటే దోమలు, ఇతర క్రిమికీటకాలు పెరిగి రోగులకు మరింత ఇన్‌ఫెక్షన్స్ పెరిగే ప్రమాదం ఉంది. అయినా ఆస్పత్రి అధికారులు వార్డుల మధ్య శానిటేషన్ మెరుగుపడేలా చేయకుండా చోద్యం చూస్తున్నారనే ఆరోపణలున్నాయి. రోగుల సహాయకులు బయటి ఆహారం తీసుకొచ్చి ఆస్పత్రిలో తిని ఎక్కడ పడితే అక్కడ పడేయటం వలన ఎలుకలు వస్తున్నాయని పెస్ట్ కంట్రోల్ వారు ఆరోపిస్తున్నారు. సెక్యూరిటీ, శానిటేషన్, పెస్ట్ కంట్రోల్ కాంట్రాక్టర్‌కు పనితీరు ఆధారంగా మార్కులు వేసే అధికారులు వారి మధ్య సమన్వయం ఏర్పాటు చేసి ఆస్పత్రి అంతా పరిశుభ్రం పెంచేలా చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తిపోతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఆస్పత్రిలో పారిశుద్ధ్యం బాగా లేదని అధికారులు సదరు కాంట్రాక్టర్‌కు పనితీరు ఆధారంగా ఇచ్చే మార్కుల్లో కోత పెట్టేసి చేతులు దులుపుకుంటాన్నారు. ఆస్పత్రిలో శానిటేషన్ మెరుగుపర్చటానికి సరైన చర్యలు తీసుకోవటంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రిలో శానిటేషన్ పర్యవేక్షణ బాధ్యతలు ఆర్‌ఎంఓలు, నర్శింగ్ సూపరింటెండెంట్‌లు, నర్శింగ్ సిబ్బంది, శానిటరీ ఇన్‌స్పెక్టర్ చూడాల్సి ఉంది. ప్రతిరోజూ వార్డుల్లో, ఆస్పత్రి అంతా తనిఖీలు చేసి శానిటేషన్ పనితీరు పెంచేలా పనిచేయాల్సి ఉంది.


