సముద్రం అలకల్లోలం | - | Sakshi
Sakshi News home page

సముద్రం అలకల్లోలం

Oct 27 2026 1:44 AM | Updated on Oct 27 2026 1:44 AM

బాపట్ల: అర్నాబ్‌ తుపాను ప్రభావం నేపథ్యంలో బాపట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తున్న నేపథ్యంలో ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ నెల 27, 28 తేదీల్లో బీచ్‌లలో పర్యాటకుల సంచారంపై నిషేధం విధిస్తూ జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్‌ చర్యలు చేపట్టారు. ప్రజలు, పర్యాటకులు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. 60 నుంచి 110మి.మీ వర్షపాతం నమోదు కావచ్చని అంచనాకు వచ్చారు. సోమవారం రాత్రి నుంచే ఈదురుగాలులు మొదలయ్యాయి. చీలురోడ్డులో వినాయకుని మండపం కోసం వేసి రేకులషెడ్డు కూడా గాలులకు పడిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement